ETV Bharat / state

'అంతరాష్ట్ర ఉద్యోగుల బదిలీల సమస్యలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి' - CPI National Secretary Narayana

Transfer of Government Employees: తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు సమ్మతించవలసిందిగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాసిన ఉత్తరంపై తగు నిర్ణయం తీసుకోవాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ కోరారు. ఈ మేరకు సీఎం కేసీఆర్​కు ఆయన లేఖ రాశారు.

Narayana
Narayana
author img

By

Published : Dec 11, 2022, 8:42 PM IST

Transfer of Government Employees: తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు సమ్మతించవలసిందిగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాసిన ఉత్తరంపై తగు నిర్ణయం తీసుకోవాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ కోరారు. ఈ మేరకు సీఎం కేసీఆర్​కు లేఖ రాశారు. రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 1369 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు.

ఉద్యోగులను ఏపీకి పంపేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి అభ్యంతరం లేదని ధృవీకరణ ఇచ్చి పంపించిన పిదప.. ఏపీ ప్రభుత్వం వారు 1369 మందిని తీసుకొనుటకు అంగీకారాన్ని తెలియజేయాల్సిందిగా ఆయన కోరారు. అదే విధంగా తెలంగాణకు చెందిన 1808 ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్‌లో పనిచేస్తున్నారని.. వారు తెలంగాణకు రావడానికి దరఖాస్తు చేసుకున్నారని నారాయణ వివరించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, వారికి ఎన్‌ఓసీ ఇచ్చి సంబంధిత పత్రాన్ని తెలంగాణకు పంపిందని తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వం 1808 అంతర్‌ రాష్ట్ర ఉద్యోగుల బదిలీలను మానవతా దృక్పథంతో పరిశీలించి సత్వర నిర్ణయం తీసుకుని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి అంగీకారాన్ని తెలపాలని కోరారు. అంతరాష్ట్ర బదిలీలకు కొరకు దరఖాస్తు చేసుకున్న ఉద్యోగుల సమస్యలన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించి వారికి తగిన న్యాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.