Transfer Orders Issued IAS and IPS Officers in Telangana : రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ వేళ వేటు పడిన అధికారుల స్థానంలో ఈసీ ఆదేశాలకు అనుగుణంగా.. అధికారుల బదిలీకి సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రం పంపిన ప్యానెల్ నుంచి అధికారులను ఎంపిక చేసిన ఈసీ.. అందుకు సంబంధించిన జాబితాను వెల్లడించింది. ఈ మేరకు సర్కారు ఉత్తర్వులు జారీ చేస్తూ.. రవాణా శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణిప్రసాద్, ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖ ముఖ్యకార్యదర్శిగా సునీల్ శర్మ, ఎక్సైజ్ కమిషనర్‌గా జ్యోతి బుద్ధ ప్రకాశ్, వాణిజ్య పన్నులశాఖ కమిషనర్‌గా క్రిస్టినా పేర్లను ప్రకటించింది. రంగారెడ్డి కలెర్టర్‌గా భారతీ హోలీకేరీ, మేడ్చల్ కలెక్టర్‌గా గౌతం, యాదాద్రి కలెక్టర్‌గా హనుమంత్, నిర్మల్ కలెక్టర్‌గా ఆసీసీ సగ్వాన్‌ను నియమించింది.
Telangana Assembly Elections Transfers to Officers : వరంగల్ కమిషనర్‌గా అంబర్ కిషోర్ ఝా, నిజామాబాద్ కమిషనర్‌గా కల్మేశ్వర్, సంగారెడ్డి ఎస్పీగా రూపేశ్, మహబూబ్‌నగర్ ఎస్పీగా హర్షవర్థన్, భూపాలపల్లి ఎస్పీగా కిరణ్ ఖారే, కామారెడ్డి ఎస్పీగా సింధూశర్మ, నాగర్ కర్నూల్ ఎస్పీగా వైభవ్ రఘునాథ్, సూర్యాపేట ఎస్పీగా రాహూల్ హెగ్డే, మహబూబాబాద్ ఎస్పీగా పాటిల్ సంగ్రం సింగ్, జగిత్యాల ఎస్పీగా సన్‌ప్రీత్ సింగ్, నారాయణపేట ఎస్పీగా యోగేశ్ గౌతం, జోగులాంబ గద్వాల ఎస్పీగా రితీరాజ్ బదిలీ అయ్యారు. బదిలీ అయిన వాళ్లు ఈ రోజు సాయంత్రం 4 గంటల లోపు బాధ్యతలు తీసుకోవాలని సీఎస్ ఆదేశించారు. హైదరాబాద్ సీపీ పేరును మాత్రం ఈసీ వెల్లడించకపోవడం గమనార్హం. ఐపీఎస్‌ల బదిలీతో ప్రస్తుతం హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో కొన్ని ఖాలీ అయ్యాయి. ఆయా స్థానాలను సమీపంలో ఉన్న డీసీపీలకు కేటాయించారు. త్వరలో బదిలీ అయిన స్థానాలకు కొత్త ఐపీఎస్‌లను కేటాయించనున్నారు.
Telangana CS Sent New IPS List to EC : ఈసీ బదిలీ చేసిన పోస్టులకు ప్యానెల్ పంపిన రాష్ట్ర ప్రభుత్వం
ఈసీ ఆదేశాలకు అనుగుణంగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీ ఉత్తర్వులు :
- రవాణాశాఖ ముఖ్య కార్యదర్శిగా వాణీప్రసాద్
- ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖ ముఖ్యకార్యదర్శిగా సునీల్ శర్మ
- ఎక్సైజ్ కమిషనర్‌గా జ్యోతి బుద్ధ ప్రకాశ్
- వాణిజ్య పన్నులశాఖ కమిషనర్‌గా క్రిస్టినా
- రంగారెడ్డి కలెక్టర్‌గా భారతీ హోలీకేరీ
- మేడ్చల్ కలెక్టర్‌గా గౌతం
- యాదాద్రి కలెక్టర్‌గా హనుమంత్
- నిర్మల్ కలెక్టర్‌గా ఆశీష్ సంగ్వాన్
- వరంగల్ పోలీసు కమిషనర్‌గా అంబర్ కిషోర్ ఝా
- నిజామాబాద్ పోలీసు కమిషనర్‌గా కల్మేశ్వర్
- సంగారెడ్డి ఎస్పీగా చెన్నూరి రూపేష్
- కామారెడ్డి ఎస్పీగా సింధూ శర్మ
- జగిత్యాల ఎస్పీగా సంప్రీత్ సింగ్
- మహబూబ్‌నగర్ ఎస్పీగా హర్షవర్ధన్
- నాగర్‌కర్నూల్ ఎస్పీగా వైభవ్ రఘునాథ్
- జోగులాంబ గద్వాల్ ఎస్పీగా రితిరాజ్
- మహబూబాబాద్ ఎస్పీగా పాటిల్ సంగ్రామ్‌సింగ్ గణపతిరావ్
- నారాయణపేట ఎస్పీగా యోగేష్ గౌతమ్
- భూపాలపల్లి ఎస్పీగా కిరణ్ ప్రభాకర్
- సూర్యాపేట ఎస్పీగా రాహుల్ హెగ్డే
Who is Hyderabad New CP : హైదరాబాద్ సీపీ ఎవరు?.. పరిశీలనలో ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన అధికారులు