ETV Bharat / state

TS Transco: ఏపీ రూ.4,457 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది: ప్రభాకర్‌రావు - తెలంగాణ వార్తలు

TS Transco, TS Transco cmd prabhakar rao about arrears
ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్ రావు, ఏపీ చెల్లించాల్సిన బకాయిలపై తెలంగాణ
author img

By

Published : Sep 14, 2021, 12:29 PM IST

Updated : Sep 14, 2021, 12:57 PM IST

12:24 September 14

'ఏపీ విద్యుత్‌ సంస్థలే తెలంగాణకు బాకీ ఉన్నాయి'

విద్యుత్‌ బకాయిలపై  ఆంధ్రప్రదేశ్‌ వాదనలు తెలంగాణ తోసిపుచ్చింది. ఏపీ విద్యుత్‌ సంస్థలే తమకు రూ.4,457 కోట్లు చెల్లించాల్సి ఉందని తెలంగాణ ట్రాన్స్‌కో-జెన్‌కో సీఎండీ ప్రభాకరరావు స్పష్టం చేశారు. తెలంగాణ నుంచి తమకు రావలసిన బాకీలను చెల్లించేలా ఆదేశాలివ్వాలంటూ ఏపీ జెన్‌కో హైకోర్టులో సోమవారం పిటిషన్‌ దాఖలు చేసింది. అందుకు సమాధానంగా సీఎండీ ప్రభాకరరావు ప్రకటన విడుదల చేశారు. 

ఆ విషయంపై మాట్లాడడం లేదు

ఏపీ జెన్‌కో నుంచి తెలంగాణ కొనుగోలు చేసిన కరెంటుకు రూ.4,887 కోట్లు చెల్లించాల్సి ఉందని ఆంధ్రప్రదేశ్‌ చెబుతోందన్నారు. తెలంగాణ విద్యుత్‌ సంస్థలకు చెల్లించాల్సిన ఇతర బకాయిల విషయంపై మాట్లాడడం లేదన్నారు. అనంతపురం, కర్నూలు జిల్లాల్లో విద్యుత్‌ మౌలిక సదుపాయాల కల్పనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తీసుకున్న రుణాలు  రూ.2,725 కోట్లు... తెలంగాణ చెల్లిస్తోందన్నారు. అలాగే ఏపీ జెన్‌కోలో పెట్టుబడులు, వాటాల విభజనలో తెలంగాణ జెన్‌కోకు రూ.3,857 కోట్లు రావాల్సి ఉందన్నారు. 

హైకోర్టుకు వివరిస్తాం

కృష్ణపట్నం విద్యుత్‌కేంద్రంలో తెలంగాణ డిస్కంలు పెట్టిన పెట్టుబడి సొమ్ము వడ్డీతో సహా రూ.16,11 కోట్లు రావాలని ప్రభాకర్‌రావు వివరించారు. ఇతర బకాయిలన్నీ కలిపి లెక్కిస్తే ఆంధ్రప్రదేశ్‌ బాకీ పోను నికరంగా తెలంగాణ విద్యుత్‌ సంస్థలకే రూ.4,457 కోట్లు ఏపీ చెల్లించాల్సి ఉందని టీఎస్ జెన్‌కో సీఎండీ స్పష్టం చేశారు. దీనిపై అడిగితే ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ సంస్థలు స్పందించడం లేదన్నారు. తెలంగాణ వాదనలను హైకోర్టుకు వివరిస్తామన్నారు.

ఇదీ చదవండి: Yadadri: నయనానందకరం... భక్తులకు త్వరలోనే సుందర యాదాద్రి దర్శనం

Last Updated : Sep 14, 2021, 12:57 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.