రోడ్డు ప్రమాదాల్లో వేల సంఖ్యలో ప్రాణాలు పోతున్నాయి. కారణం ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడమే. ఇటీవల కేంద్ర ఉపరితల రవాణ శాఖ విడుదల చేసిన గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేశాయి. రోడ్డు ప్రమాదాలు తగ్గించడానికి తెలంగాణ పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటూనే.. చిన్నారులకు ట్రాఫిక్ నిబంధనలపై మరింత అవగాహన కలిగించడానికి శ్రీకారం చుట్టారు. నాగోల్‌లో చిన్నారుల ట్రాఫిక్ పార్కు అందుబాటులోకి తెచ్చారు.
ట్రాఫిక్‌పై అవగాహన
రహదారులపై వాహనాలు ఏ విధంగా నడపాలి, నిబంధనలు ఎలా పాటించాలి తదితర అంశాలపై నిపుణులు విద్యార్థులకు అవగాహన కల్పిస్తారు. ఈ పార్కును అదనపు డీజీ జితేందర్ ప్రారంభించారు. ఈ పార్కును హీరో సంస్థ సౌజన్యంతో రాచకొండ పోలీసులు ఏర్పాటు చేశారు.
విద్యార్థి దశ నుంచే
రహదారులను సురక్షితంగా మార్చడానికి ప్రతీ ఒక్కరు విధిగా ట్రాఫిక్ నిబంధనలను పాటించాల్సిన అవసరం ఉందని పలువురు విద్యార్థులు చెప్పారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌తో పాటు నిబంధనలు పాటించని వారిపై తీసుకుంటున్న చర్యల కారణంగా ప్రమాదాల సంఖ్య తగ్గుతోందన్నారు. విద్యార్థి దశ నుంచే ట్రాఫిక్ నిబంధనల పట్ల అవగాహన కల్పించడం వల్ల ప్రమాదాల సంఖ్య తగ్గుతుందని ఉపాధ్యాయులు అంటున్నారు.
జిల్లాలో కూడా
రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి పోలీసులు చేపడుతున్న చర్యలను ప్రజలు అభినందిస్తున్నారు. అన్ని జిల్లాలో కూడా ట్రాఫిక్ పార్కు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
ఇవీ చూడండి: కామారెడ్డిలో హమాలీ దారుణ హత్య