ETV Bharat / state

హైదరాబాద్​ వాసులకు అలర్ట్ - ఆ మార్గాల్లో ట్రాఫిక్​ ఆంక్షలు

Traffic Restrictions in Hyderabad Today : రాష్ట్ర ముఖ్యమంత్రిగదా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎల్బీ స్టేడియంలో జరిగే సభకు, ఏఐసీసీ ప్రముఖులతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్‌ నేతలు హాజరు కానున్న తరుణంలో తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. జడ్‌ ప్లస్‌ భద్రత ఉన్న నాయకుల విషయంలో పోలీసులు ప్రత్యేక జాగ్రత్త వహిస్తున్నారు. మరోవైపు ట్రాఫిక్ పోలీసులు నేడు ఎల్బీ స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

Traffic Restrictions in Hyderabad Today
Traffic Restrictions in Hyderabad Today
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 7, 2023, 10:18 AM IST

Traffic Restrictions in Hyderabad Today : నేడు హైదరాబాద్‌లో రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా నగరంలో పలుచోట్లట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. ఎల్బీ స్టేడియం పరిసరాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఎల్బీ స్డేడియం వైపు వెళ్లే దారుల్లో వాహనాలను అనుమతించమని పేర్కొన్నారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.

  • పబ్లిక్‌గార్డెన్‌ నుంచి ఎల్బీ స్టేడియం వెళ్లే వాహనాలు నాంపల్లి వైపు
  • ఎస్బీఐ గన్‌ఫౌండ్రి నుంచి వచ్చే వాహనాలు చాపెల్‌ రోడ్డు వైపు
  • బషీర్‌బాగ్‌ నుంచి ఎల్బీ స్టేడియం వైపు వచ్చే వాహనాలు కింగ్‌ కోఠి వైపు
  • ఖాన్‌ లతీఫ్‌ ఖాన్‌ బిల్డింగ్‌ వైపు నుంచి వచ్చే వాహనాలు నాంపల్లి వైపు మళ్లించనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.

Congress Take Oath in LB Stadium Today : వాహనదారులకు ఏదైనా అసౌకర్యం కలిగితే 910203626 హెల్ప్‌ లైన్ నెంబర్‌కు ఫోన్ చేయాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. ప్రమాణ స్వీకారోత్సవం ముగిసిన వెంటనే ఒక్కసారిగా అందరూ స్టేడియం నుంచి బయటికి వచ్చే అవకాశం ఉంటుంది. ఆ సమయంలో ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నామని పోలీసులు తెలిపారు.

'ప్రగతి అంటే ఏమిటో రేవంత్ పాలనలో ప్రజలకు అర్థమవుతుంది'

మరోవైపు రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. ఈ కార్యక్రమానికి ప్రజలను భారీ సంఖ్యలో కూడగట్టేలా కాంగ్రెస్ నాయకులు ప్రణాళికలు రూపొందించారు. తెలంగాణలోని 119 నియోజకవర్గాల నుంచి ప్రజలు సభకు వచ్చేలా ప్లాన్ చేశారు. హస్తం పార్టీ నేతలు మల్లు రవి, మహేశ్ కుమార్ గౌడ్ , అంజన్‌కుమార్, వసంతకుమార్, చామల కిరణ్‌కుమార్ రెడ్డి సహా పార్టీలోని సీనియర్ నేతలు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ప్రమాణ స్వీకారానికి మొత్తం మూడు వేదికలు ఏర్పాటు చేస్తున్నట్లు వారు తెలిపారు.

Huge Arrangements at LB Stadium New CM Oath Ceremony : ప్రమాణ స్వీకార కార్యక్రమానికి దాదాపు లక్ష మంది ఎల్బీ స్టేడియానికి (LB Stadium) తరలి వస్తారని పోలీసులు భావిస్తున్నారు. ఇందుకు అనుగుణంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. భద్రతా ఏర్పాట్లపై డీజీపీ రవిగుప్తా, ఇతర పోలీస్ ఉన్నతాధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సమీక్షించారు. డీజీ సీవీ ఆనంద్, అదనపు డీజీలు శివధర్‌రెడ్డి స్టేడియంలో ఏర్పాట్లను పర్యవేక్షించారు.

భట్టికి రెవెన్యూ, శ్రీధర్ బాబుకు ఆర్థికం, కోమటిరెడ్డికి నీటిపారుదల శాఖ - కొత్త సర్కారులో మంత్రులు వీళ్లే!C

ప్రమాణ స్వీకారోత్సవానికి వచ్చే వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటూ పోలీసు అధికారులు కార్యక్రమంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్నారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే రేవంత్‌రెడ్డితో పాటు, ఇతర ప్రముఖులు గేట్ నెంబర్ 8 నుంచి స్టేడియం లోపలికి రానున్నారు. వీఐపీలను పంపించే గేట్లలో ఇతరులకు ప్రవేశం ఉండదు.

Revanth Reddy Swearing Ceremony in LB Stadium : జడ్‌ ప్లస్ భద్రత ఉన్న ఏఐసీసీ నేతలు సభకు హాజరు కానున్న తరుణంలో పోలీసులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. ఇప్పటికే జడ్‌ ప్లస్ కేటగిరి భద్రతను పర్యవేక్షించే అధికారులతో హైదరాబాద్ పోలీసులు సమన్వయం చేసుకుని తగిన భద్రతా ఏర్పాట్లు చేశారు. సాయుధ బలగాలతో పాటు శాంతిభద్రతల పోలీసులు, ప్రత్యేక పోలీసులు క్విక్ రియాక్షన్ టీమ్స్ ఎల్బీ స్డేడియంలో విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు.

Hyderabad Traffic Alert : కాంగ్రెస్‌ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు వివిధ గేట్ల ద్వారా స్టేడియంలోనికి అనుమతిస్తామని పోలీసులు చెప్పారు. లోపలికి వెళ్లే సమయంలో మెటల్ డిటెక్టర్‌ ద్వారా తనిఖీలు చేసి పంపించనున్నట్లు పోలీసులు వివరించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చే వాహనాలకు నిజాం మైదానంలో పార్కింగ్ ఏర్పాట్లు చేశారు.

ప్రజా ప్రభుత్వ ప్రమాణస్వీకారానికి ప్రజలందరికీ రేవంత్‌రెడ్డి బహిరంగ ఆహ్వానం

కాంగ్రెస్​ ప్రభుత్వంలో ఈమెకే తొలి ఉద్యోగం - రేవంత్​ రెడ్డి అభయహస్తం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.