ETV Bharat / state

సదర్ ఉత్సవాలు... హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు - హైదరాబాద్ జిల్లా వార్తలు

హైదరాబాద్‌లో ఘనంగా జరిగే సదర్ ఉత్సవాల సందర్భంగా పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం ఉదయం వరకు ఈ ఆంక్షలు వర్తిస్తాయని పోలీసులు వెల్లడించారు. వాహనదారులు సహకరించాలని కోరారు.

Traffic restrictions in hyderabad due to sadar celebrations
సదర్ ఉత్సవాలు... హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
author img

By

Published : Nov 15, 2020, 7:30 PM IST

హైదరాబాద్ నారాయణ గూడలో సదర్ ఉత్సవాలను పురస్కరించుకొని పోలీసులు పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. కాచిగూడ నుంచి నారాయణ గూడ వచ్చే వాహనాలను కాచిగూడ టూరిస్ట్ హోటల్ మీదుగా మళ్లించనున్నారు. విట్టల్ వాడి నుంచి వచ్చే వాహనాలు రామకోటి క్రాస్ రోడ్, ఓల్డ్ బర్కత్‌పుర నుంచి వచ్చే వాహనాలు క్రౌన్ కేఫ్ మీదుగా మళ్లిస్తారని పేర్కొన్నారు. బర్కత్‌పుర చమాన్ నుంచి వచ్చే వాహనాలు టూరిస్ట్‌ హోటల్ మీదుగా భర్కత్‌పుర క్రాస్ రోడ్ వైపు, నారాయణగూడా లిటిల్ ఫ్లవర్ స్కూల్ నుంచి రెడ్డి కళాశాల మీదుగా వచ్చే వాహనాలు నారాయణగూడా క్రాస్ రోడ్‌ వైపు మళ్లించనున్నట్లు తెలిపారు.

ఈ ఆంక్షలు సోమవారం సాయంత్రం 7గంటల నుంచి మంగళవారం తెల్లవారు జామున 3గంటల వరకు అమల్లో ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. వాహనదారులు సహకరించాలని కోరారు.

ఇదీ చదవండి: జీహెచ్​ఎంసీ పోరు: జాతీయ నేతలతో భాజపా పర్యవేక్షణ కమిటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.