ETV Bharat / state

ట్రా'ఫికర్': రోడ్లపైకి లక్షల్లో వాహనాలు - Lockdown goes for a toss: All of Hyderabad traffic on roads

రాష్ట్ర రాజధానిలో ఓవైపు లాక్‌డౌన్ కొనసాగుతున్నప్పటికి.. మరోవైపు ప్రధాన రహదారులపై ట్రాఫిక్‌జాం అవుతున్నాయంటూ ట్రాఫిక్ పోలీసులకు ఫోన్లు వస్తున్నాయి. రెండు రోజుల నుంచి పదుల సంఖ్యలో ఫోన్లు రావడం వల్ల సహాయ వాణిని అందుబాటులోకి తీసుకువచ్చారు. సామాజిక మాధ్యమాలైన ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌లలో సహాయవాణి నంబర్‌ను పొందుపరిచారు.

Traffic jam in the Greater Hyderabad
హైదరాబాద్ లాక్‌డౌన్.. ప్రధాన రహదారులు ట్రాఫిక్ జాం..!
author img

By

Published : May 13, 2020, 9:48 AM IST

భాగ్యనగరంలో లాక్‌డౌన్‌ సమయంలోనూ ట్రాఫిక్‌జాంలు అవుతున్నాయంటూ ట్రాఫిక్ పోలీసులకు ఫోన్లు వస్తున్నాయి. రెండు రోజుల నుంచి పదుల సంఖ్యలో ఫోన్లు చేస్తున్న వారికి తమ సహాయ వాణి(హెల్ప్‌ లైన్‌) 90102 03626 నంబర్‌కు ఫోన్‌ చేయాలంటూ సూచిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల కార్యకలాపాలు మొదలవడం వల్ల గత శుక్రవారం కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్‌ స్తంభించింది. తాము ట్రాఫిక్‌లో చిక్కుకున్నామంటూ వాహనదారులు పోలీస్‌ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం వల్ల వారు సామాజిక మాధ్యమాలైన ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌లలో సహాయవాణి నంబర్‌ను పొందుపరిచారు.

శని, ఆదివారాల్లో పెద్దగా ఫోన్లు రాలేదు... సోమవారం నుంచి వందల మంది సహాయవాణికి ఫోన్‌ చేస్తున్నారు. పోలీస్‌ అధికారులు మరో రెండు ఫోన్‌ నంబర్లు 94905 98985, 040-2785 2482 అందుబాటులోకి తీసుకువచ్చారు.

సహాయ వాణి సేవలు..

ట్రాఫిక్‌జాంలు అవుతున్నాయంటూ ఫోన్లు చేస్తున్న వారి ద్వారా సమాచారం సేకరిస్తున్న ట్రాఫిక్‌ సిబ్బంది వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం ఇస్తున్నారు. కొవిడ్‌-19 సమాచారం, సహాయం కోసం అందుబాటులోకి తెచ్చిన వివిధ శాఖల ఫోన్‌ నంబర్లలో ట్రాఫిక్‌ హెల్ప్‌లైన్‌ ఫోన్‌ నంబర్‌ కూడా ఉండడంతో చాలామంది అంతరాష్ట్ర పాస్‌లు, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లేందుకు వాహనాలకు పాస్‌లను అడుగుతున్నారు. ఫలానా వెబ్‌సైట్‌లో పాస్‌ల కోసం దరఖాస్తు చేసుకోవాలంటూ సిబ్బంది సూచిస్తున్నారు.

ఆంక్షల సడలింపు...లక్షల్లో వాహనాలు

రెడ్‌జోన్‌లో ఆంక్షల సడలింపు వల్ల నగరంలో రోజుకు సగటున 4.5 లక్షల వాహనాలు రాకపోకలు కొనసాగిస్తున్నాయని ట్రాఫిక్‌ పోలీసులు అంచనా వేశారు. రహదారులపై ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులు, ట్రాఫిక్‌ కూడళ్లవద్ద వాహనాలను తనిఖీలు చేస్తూనే ట్రాఫిక్‌జాం కాకుండా చర్యలు చేపడుతున్నారు. పోలీస్‌లు ఊహించని ప్రాంతాల్లోనూ ట్రాఫిక్‌ స్తంభించిపోతోంది.

ఇతర ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు సమాచారం ఆలస్యంగా అందుతోంది. మలక్‌పేట, నల్గొండ క్రాస్‌రోడ్స్‌, ఆబిడ్స్‌, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌, బేగంపేట, ఎర్రగడ్డ ప్రాంతాల్లో ఎక్కువగా ట్రాఫిక్‌జాంలు అవుతుండడంతో పోలీస్‌ ఉన్నతాధికారులు ఆయా మార్గాల్లో ప్రత్యేకంగా ట్రాఫిక్‌ సిబ్బందిని విధులకు వినియోగిస్తున్నారు.

ఇదీ చూడండి: రాష్ట్రవ్యాప్తంగా 'విత్తన మేళా'కు రంగం సిద్ధం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.