భాగ్యనగర వాసులకు మళ్లీ ట్రాఫిక్ కష్టాలు ప్రారంభమయ్యాయి. కరోనా మహమ్మారి నుంచి నిబంధనలు సడలించిన నేపథ్యంలో హైదరాబాద్లో ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చారు. లాక్డౌన్ సడలింపులతో పాటు నగరంలో పార్కులు, మెట్ర్రైల్, ఆఫీసులు తిరిగి ప్రారంభం కావడం వల్ల సాధారణ పరిస్థితులు కనిపిస్తున్నాయి.
పెద్ద ఎత్తున ప్రజలు వాహనాలతో రోడ్లపైకి రావడం వల్ల ప్రయాణం నెమ్మదించింది. ముఖ్యంగా లక్డీకాపుల్, ఖైరతాబాద్, అమీర్పేట ప్రాంతాల్లో ఎక్కువగా ట్రాఫిక్ సమస్యతో జనాలు సతమతం అయ్యారు.