భాగ్యనగరంలో ట్రాఫిక్ కష్టాలు అందరికీ సుపరిచితమే. నగర రోడ్లన్నీ వాహనాల రద్దీతో ఎప్పుడూ కిక్కిరిసిపోయి ఉంటాయి. కొందరు నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతుంటే... ఇంకొందరు అతి వేగంతో ప్రమాదాలకు కారణమవుతున్నారు. ట్రాఫిక్ పోలీసులు ఇప్పటివరకూ విధించిన చలాన్లలో అత్యధిక శాతం హెల్మెట్ లేకుండా, అతివేగంతో బైకు నడిపిన కేసులే ఎక్కువ. ఈ ఏడాది ఇప్పటి వరకు సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో 40 లక్షల 80 వేల 477 కేసులు నమోదు చేశారు.
ఇవే ప్రమాదాలకు కారణం
ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించి ఇప్పటి వరకూ మూడు కమిషరేట్ల పరిధిలో 646 మంది ప్రమాదాల్లో మృత్యువాత పడ్డారు. ర్యాష్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్, రాంగ్ రూట్, త్రిపుల్ రైడింగ్ వల్లనే ప్రమాదాలు జరుగుతున్నాయనడానికి ప్రమాద ఘటనలే సాక్ష్యం.
పాఠశాల స్థాయి నుంచే ట్రాఫిక్ పాఠాలు
ట్రాఫిక్ నియమాలపై పోలీసులు ఎప్పటికప్పుడు అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నా వాహనదారుల చెవికెక్కడం లేదు. పిల్లల్లో భద్రతా నియమాలపై అవగాహన కల్పించేందుకు పాఠశాల స్థాయి నుంచే ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఇదీ చూడండి: డ్రైవర్ నిర్లక్ష్యం... త్రుటిలో తప్పిన ప్రమాదం