తెలంగాణ కాంగ్రెస్‌లో కొంత కమ్యూనికేషన్ గ్యాప్ ఉందని... దాన్ని తొలగించే ప్రయత్నం చేస్తున్నామని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ (pcc working president) జగ్గారెడ్డి అన్నారు. గాంధీభవన్‌లో మీడియాతో ఆయన ఇష్టాగోష్ఠిగా (chit chat with jagga reddy) మాట్లాడారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని.. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తాలిబన్లతో పోల్చడాన్ని తాను సమర్థించనని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తెలిపారు.
కాంగ్రెస్‌పై కోమటిరెడ్డికి కోపం ఉంటే పార్టీలోనే ఉండేవారు కాదని పేర్కొన్నారు. ‘‘విజయమ్మ ఆహ్వానం మేరకే కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెళ్లారు. ఆత్మీయ సమ్మేళనం సభ అనుకొని వెళ్లి ఉండొచ్చు. ఎంపీ కోమటిరెడ్డి విషయంలో పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ ఏ కోణంలో మాట్లాడారో తెలియదు. పార్టీ ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలపై నేను స్పందించను.
కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిర్ణయాన్ని సమర్థిస్తున్నా. కోమటిరెడ్డికి, పీసీసీ కొత్త కమిటీకి కొంత కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది. దాన్ని తొలగించే ప్రయత్నం చేస్తున్నాం. త్వరలోనే ఆయన కూడా గాంధీ భవన్‌కు వస్తారు. కేసీఆర్, అమిత్ షా కలిసిపోతే.. బండి సంజయ్ యాత్ర చేసి ఏం ఉపయోగం. కేసీఆర్‌ను జైల్లో పెడతామని సంజయ్ వందసార్లు చెప్పారు. కేసీఆర్ ను జైల్లో పెట్టాల్సిన అమిత్ షా ముందే కేసీఆర్ దర్జాగా కూర్చున్నారు’’
జగ్గారెడ్డి, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్
ఇదీ చూడండి: SEETHAKKA: కేసీఆర్ పాలనలో పన్నీరు ఎవరికి.. కన్నీరు ఎవరికి?: సీతక్క