TCongress on agnipath: ఆర్మీ అభ్యర్థుల ఆశలపై నీళ్లు చల్లేలా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్‌ను తక్షణమే రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. యువత ఆలోచనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న మోదీ సర్కార్ తీరును నిరసిస్తూ.. ఆదివారం గాంధీ భవన్లో సత్యాగ్రహ దీక్ష చేపడుతున్నామని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్‌కుమార్ గౌడ్ వెల్లడించారు. అగ్నిపథ్ పేరుతో కొత్త పథకం తీసుకొచ్చి సైన్యంలో చేరాల్సిన యువతను తీవ్రంగా అవమానపరుస్తున్నారని మండిపడ్డారు.
సైన్యంలో కూడా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ విధానం తీసుకొచ్చి యువతను నిర్వీర్యం చేస్తున్న అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలని ఏఐసీసీ డిమాండ్ చేసిందని అయన తెలిపారు. కేంద్రం తీరుకు నిరసనగా ఆదివారం ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు గాంధీభవన్‌లోని గాంధీ విగ్రహం వద్ద సత్యాగ్రహదీక్ష చేపట్టనున్నారు. ఈ దీక్షకు కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలని సూచించారు. అగ్నిపథ్ రద్దయ్యేవరకు కాంగ్రెస్ పోరాటం చేస్తుందని మహేష్‌కుమార్ గౌడ్ తెలిపారు.
ఇదీ చదవండి: రాకేశ్ చావుతో తెరాస శవరాజకీయాలు చేస్తోంది:రేవంత్‌రెడ్డి
11వ శతాబ్దం విగ్రహాలు చోరీ.. 37ఏళ్ల తర్వాత స్వదేశానికి.. రూ.కోట్లలో విలువ