ETV Bharat / state

Revnath reddy on KCR: నిజాం నవాబుల కంటే కేసీఆర్ కుటుంబమే సంపన్నం: రేవంత్‌రెడ్డి - రాహుల్ సభపై రేవంత్

Revnath reddy on KCR: కేసీఆర్ అవినీతికి అవధులు లేకుండా పోయానని టీపీసీసీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. వందల కోట్లతో నిర్మించిన యాదాద్రిని భ్రష్టు పట్టించారని విమర్శించారు. రాహుల్ వరంగల్ పర్యటనకు సంబంధించిన రైతు సంఘర్షణ సభ దృశ్య కావ్యాన్ని కలిసి హైదరాబాద్​లోని ప్రసాద్ ల్యాబ్స్​లో ఆవిష్కరించారు.

Revnath reddy on KCR
టీపీసీసీ రేవంత్ రెడ్డి
author img

By

Published : May 5, 2022, 4:54 PM IST

Revnath reddy on KCR: కేసీఆర్ కుటుంబం ఆస్తుల విలువ నిజాం నవాబుల సంపదను మించిపోయిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ అవినీతికి అవధులు లేకుండా పోయానన్న రేవంత్... యాదాద్రి ఆలయ నిర్మాణంలో కూడా ముఖ్యమంత్రి కుటుంబ అవినీతికి పాల్పడిందని విమర్శించారు. ప్రజా గాయకుడు గద్దర్ గాంధీ కుటుంబంపై రూపొందించిన రైతు సంఘర్షణ సభ దృశ్య కావ్యాన్ని కాంగ్రెస్ నేతలతో కలిసి ప్రసాద్ ల్యాబ్స్​లో ప్రారంభించారు.

కేసీఆర్, మోదీ కలిసి రాజకీయ క్షేత్రాన్ని దోచుకునేందుకు వాడుకుంటున్నరు. ఎవరిమీద ఎవరు ఆధారపడకండి. ఒక పూట తినకుండానైనా రాహుల్ గాంధీ సభకు రండి. రైతుల ఇళ్ల నుంచి సభకు కదలిరండి. తెలంగాణ బిడ్డల నమ్మకమైన యాదాద్రిలో అవినీతి చీడ కనిపిస్తోంది. కేసీఆర్ కుటుంబం అవినీతికి స్వామివారు కూడా బలైపోయిండు. 1200 మంది త్యాగాల మీద ఏర్పడ్డ స్మారక స్థూపానికి 200 కోట్లు కేటాయించిన పూర్తి కాలేదు. నిజాం వారసుల సంపద కంటే కేసీఆర్ కుటుంబం సిరి సంపదలతో తూలతూగుతోంది. ప్రజలంతా రాహుల్ సభకు తరలివస్తే కేసీఆర్​ను గద్దె దించుతాం.

- రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు

యాదాద్రి ఆలయం పనులను అవినీతి మయం చేశారని రేవంత్ రెడ్డి విమర్శించారు. వందల కోట్లతో నిర్మించిన యాదాద్రిని భ్రష్టు పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గద్దర గళం తమకు వెయ్యి ఏనుగుల బలాన్ని ఇచ్చిందన్నారు. వరంగల్​లో జరిగే రాహుల్ గాంధీ రైతు సంఘర్షణ సభకు రాష్ట్రంలోని రైతుల కుటుంబాల నుంచి ఒక్కొక్కరు తరలిరావాలని పిలుపు నిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై రాహుల్ గాంధీ చేయబోయే యుద్ధానికి రైతులు అండగా నిలబడాలని టీపీసీసీ రేవంత్ రెడ్డి కోరారు.

నిజాం నవాబుల కంటే కేసీఆర్ కుటుంబమే సంపన్నం: రేవంత్‌రెడ్డి

ఇవీ చూడండి: కేసీఆర్ విజన్ భాజపా, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు లేదు?: బాల్కసుమన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.