Revanth Reddy On CM KCR: కేసీఆర్ అవినీతికి, ప్రభుత్వ తప్పుడు విధానాలకు కాళేశ్వరం బలైందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రాజెక్టుల పేరుతో వేల కోట్లను దోచుకున్నారని విమర్శించారు. రీడిజైన్ పేరుతో కాళేశ్వరంలో భారీ అవినీతికి పాల్పడ్డారన్నారు. నిర్మాణం, నిర్వహణ లోపం వల్లే కాళేశ్వరం పంప్‌హౌస్‌లోకి నీళ్లు వచ్చాయని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. లక్షల ఎకరాల్లో పంట మునిగితే సీఎం నుంచి స్పందన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలోకి భాజపా నాయకురాలు కత్తి కార్తీక చేరిక సందర్భంగా ఆయన మాట్లాడారు.
కేసీఆర్ సీఎం కావడం మన దౌర్భాగ్యం. ప్రజలు కష్టాల్లో ఉంటే ఫిరాయింపు నేతలతో చర్చిస్తున్నారు. రీడిజైన్ పేరుతో కాళేశ్వరంలో భారీ అవినీతికి పాల్పడ్డారు. నిర్మాణ లోపం వల్లే కాళేశ్వరం పంప్‌హౌస్‌లోకి నీళ్లు. లక్షల ఎకరాల్లో పంట మునిగితే సీఎం నుంచి స్పందన లేదు. బండి సంజయ్, కిషన్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నాం. వరదల్లో నష్టపోయిన బాధితులకు జాతీయ విపత్తుల నిధి నుంచి రెండు వేల కోట్లు తీసుకురండి. రైతులకు నష్ట పరిహారం చెల్లించండి. ప్రభుత్వ తప్పుడు విధానాలకు ప్రజలు బలైయిండ్రు. ప్రాజెక్టుల అవినీతిపై నిర్మాణ, నిర్వహణ లోపంపై విచారణ జరపండి. కేసీఆర్ కమిషన్లతోనే మీ జాతీయ కార్యవర్గసమావేశాలు నిర్వహించారు. - రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు
కేసీఆర్ సీఎం కావడం మన దౌర్భాగ్యమని రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. ప్రజలు కష్టాల్లో ఉంటే ఫిరాయింపు నేతలతో చర్చిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే తెరాస సగం చచ్చిందని.. మరో 6 నెలల్లో పూర్తిగా ఖతమైపోతుందని రేవంత్ అన్నారు. గోదావరిలో ఇసుక దోపిడీ జరగకుంటే.. ఇంత ముంపు ఉండేది కాదని రేవంత్ వెల్లడించారు. వరద నష్టంపై రాష్ట్ర ప్రభుత్వం సమీక్ష చేసి.. కేంద్రానికి నివేదిక పంపాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: తెరాస పార్లమెంటరీ పార్టీ భేటీ.. సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సీఎం దిశానిర్దేశం