ETV Bharat / state

కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్‌ అవినీతికి బలైంది: రేవంత్​రెడ్డి - revanth reddy

Revanth on kaleshwaram: కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ అవినీతికి బలయ్యిందని టీపీసీసీ రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. వరదలో మునిగిన పంప్​హౌజ్​ వల్ల మూడు, నాలుగేళ్లు నీళ్లు ఎత్తిపోయలేని పరిస్థితి తలెత్తిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దిల్లీలో జరిగిన కాంగ్రెస్ జోడోయాత్ర సమావేశం అనంతరం ఆయన మాట్లాడారు.

Revanth on kaleshwaram
టీపీసీసీ రేవంత్ రెడ్డి
author img

By

Published : Jul 14, 2022, 7:59 PM IST

వరద నష్టాన్ని అంచనా వేయడానికి క్షేత్రస్థాయిలో పర్యటిస్తా: రేవంత్‌రెడ్డి

Revanth on kaleshwaram: ప్రాజెక్టుల రీడిజైన్ల పేరుతో సీఎం కేసీఆర్ అవినీతికి పాల్పడ్డారని టీపీసీసీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. వరదల వల్ల పంప్​హౌజ్​ మునిగిపోయి మూడు, నాలుగేళ్లు నీళ్లు ఎత్తిపోయలేని పరిస్థితి తలెత్తిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ అవినీతికి బలైందని రేవంత్ మండిపడ్డారు. ఇప్పటికైనా వరదల ప్రభావం దృష్ట్యా కేంద్రం సహాయక చర్యలు చేపట్టేలా రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేయాలని ముఖ్యమంత్రికి ఆయన సూచించారు. దిల్లీలో జరిగిన కాంగ్రెస్ జోడోయాత్ర సమావేశం అనంతరం ఆయన మాట్లాడారు.

ప్రభుత్వం నిర్లక్ష్యంతో కాళేశ్వరం నీట మునిగింది. మరో 2, 3 ఏళ్లు లిఫ్ట్ చేసే పరిస్థితి లేదు. ప్రాజెక్టుల రీ డిజైన్ల పేరుతో లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారు. ఈనెల 17 నుంచి వరద బాధిత ప్రాంతాల్లో సాయం అందిస్తాం. ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్‌లో పర్యటిస్తాం. వరద నష్టాన్ని అంచనా వేయడానికి క్షేత్రస్థాయిలో పర్యటిస్తా.పంట నష్టంపై కేంద్రానికి లేఖ రాయాలి. - రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు

వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించండి: రాష్ట్రంలో వరద ప్రభావిత ప్రాంతాలల్లో కాంగ్రెస్‌ నాయకులు పర్యటించిన తగిన చర్యలు తీసుకోవాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి పార్టీ నాయకులను ఆదేశించారు. తీవ్రంగా ప్రభావితమైన ఐదు జిల్లాలకు సీనియర్‌ నాయకులతోపాటు స్థానికులు క్షేత్రస్థాయిలో పర్యటించి వరద బాధితులకు అండగా నిలవాలని స్పష్టం చేశారు. అదిలాబాద్‌ జిల్లాలో ఏఐసీసీ కార్యక్రమాలు అమలు కమిటీ ఛైర్మన్‌ ఏలేటి మహేశ్వర రెడ్డి, మాజీ మంత్రి రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌ సాగర్‌రావు, కిసాన్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్‌ రెడ్డి, అదిలాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, ఆసిఫాబాద్‌ డీసీసీ అధ్యక్షులు సాజిద్‌ఖాన్‌, కె.సురేఖ, రామారావు పటేల్‌ పవార్‌లను నియమించారు.

అదేవిధంగా నిజామాబాద్‌ జిల్లాకు పీసీసీ కోశాధికారి సుదర్శన్‌రెడ్డి, కిసాన్‌కాంగ్రెస్‌ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి, ప్రచారకమిటీ ఛైర్మన్‌ మధుయాస్కీ గౌడ్‌, పీఏసీ కన్వీనర్‌ షబీర్‌ అలీ, వర్కింగ్‌ ప్రసిడెంట్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌, మాజీ ఎమ్మెల్యేలు గంగారాం, అనిల్‌కుమార్‌, నిజామాబాద్‌, కామారెడ్డి డీసీసీలు మోహన్‌ రెడ్డి, కైలాస్‌ శ్రీనివాస్‌రావులు పర్యటిస్తారు. కరీంనగర్‌ జిల్లాలో ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి శ్రీధర్‌బాబు, ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌, పెద్దపల్లి, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్‌, సిరిసిల్లా, కరీంనగర్‌ పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షులు లక్ష్ముణ్‌కుమార్‌, కొమరయ్య, సత్యనారాయణ, సత్యనారాయణ గౌడ్‌, నరేందర్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విజయరమణరావు, రాజ్‌ ఠాకూర్‌లు పర్యటిస్తారు.

వరంగల్‌ జిల్లాలో ఎమ్మెల్యే సీతక్క, మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్‌, మాజీ మంత్రి కొండా సురేఖ, పీసీసీ ఉపాధ్యక్షుడు వేం నరేందర్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి, వరంగల్‌, జనగాం, మహబూబాబాద్‌, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు డీసీసీ అధ్యక్షులు రాజేందర్‌ రెడ్డి, జంగారాఘవ రెడ్డి, భరత్‌ చంద్రారెడ్డి, ప్రకాష్‌ రెడ్డి, కుమార్‌ స్వామిలు వరద ప్రాంతాల్లో పర్యటిస్తారు. ఖమ్మం జిల్లాలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి, పీసీసీ ఉపాధ్యక్షుడు సంభాని చంద్రశేఖర్‌, ఎమ్మెల్యే పొదెం వీరయ్య, నగర దుర్గా ప్రసాద్‌, జావిద్‌, మాజీ ఎమ్మెల్సీ పొట్ల నాగేశ్వరరావులను నియమించారు.

ప్రజలను చైతన్యం చేసేందుకే జోడో యాత్ర

దేశ ప్రజలను చైతన్యం చేసేందుకే రాహుల్ గాంధీ జోడో యాత్ర చేపట్టనున్నట్లు రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. మక్తల్ నుంచి నాందేడ్ మీదుగా భారత్ జోడో యాత్ర కొనసాగుతుందని తెలిపారు. రాజకీయ అంశాలే తప్ప సహాయ చర్యలపై సీఎం సమీక్ష జరపలేదని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వరద బాధితులకు ఆదుకునేందుకు సహాయక చర్యలు వేగవంత చేయాలని రేవంత్​ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

ఇవీ చదవండి: Godavari Bridge: 36 ఏళ్ల తర్వాత గోదావరి వారధిపై రాకపోకలు బంద్

'రాష్ట్రంలో 19,071 మంది సురక్షిత ప్రాంతాలకు తరలింపు'

వరదల్లో బాహుబలి సన్నివేశం రిపీట్​.. 2 నెలల బాబును రక్షించిన పెద్దనాన్న..

పన్నీర్​సెల్వంకు 'పళని' మరో షాక్​.. కుమారులు సహా వారంతా పార్టీ నుంచి ఔట్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.