లాక్డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ 12 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్రం ఇస్తున్న 5 కిలోల బియ్యం ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. గతంలో మాదిరి అమ్మహస్తం ద్వారా ఇచ్చిన 9 రకాల వస్తువులు ఇవ్వాలని సర్కారుకు సూచించారు.
ప్రైవేట్ ల్యాబ్‌ల్లో కరోనా పరీక్షలు ఎందుకు చేయడం లేదని ఉత్తమ్ ప్రశ్నించారు. కాంగ్రెస్‌ను ఉద్దేశించి మంత్రి హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలు సరికావన్నారు. రైతులకు గన్నీ సంచులు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని పేర్కొన్నారు. పసుపు, బత్తాయి, మిర్చి, మామిడి, కందులు కూడా కొనుగోలు చేయాలని తెరాస సర్కారును ఉత్తమ్ డిమాండ్ చేశారు.