ETV Bharat / state

ఇంధన ధరల పెరుగుదలపై నిరసనగళం విప్పాలి: ఉత్తమ్​ - Uttam fire on bjp, trs

పట్టభద్రుల మండలి ఎన్నికల్లో తెరాస, భాజపా తీరుకు నిరసనగా ఓటు వేసి.. తగిన బుద్ధి చెప్పాలని ఓటర్లను టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు అమాంతం పెరుగుతుండడం వల్ల సామాన్యుల జీవితాలు అస్తవ్యస్తమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

ఇంధన ధరల పెరుగుదలపై నిరసనగళం విప్పాలి: ఉత్తమ్​

author img

By

Published : Mar 5, 2021, 9:18 PM IST

పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరల పెరుగుదలపై నిరసన గళం విప్పాల్సిఉందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అభిప్రాయపడ్డారు. పట్టభద్రుల మండలి ఎన్నికల్లో తెరాస, భాజపా తీరుకు నిరసనగా ఓటు వేసి బుద్ధి చెప్పాలని ఓటర్లను కోరారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు అమాంతం పెరుగుతుండడం వల్ల సామాన్యుల జీవితాలు అస్తవ్యస్తమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

2014లో పెట్రోల్ రూ.70, డీజిల్ రూ.56 ఉండేదని.. ఇవాళ పెట్రోల్ వందకు చేరువైందని డీజిల్ రూ.90లకు పైగా ఉందని ఆరోపించారు. పక్క దేశాల్లో ఈ ధరలు చాలా తక్కువ ఉన్నాయన్నారు. భాజపా, తెరాస ప్రభుత్వాలు అధికంగా పన్నులు వేసున్నందునే ధరలు అమాంతం పెరుగుతున్నాయని ఆరోపించారు.

ఇదీ చూడండి: సెగలు పుట్టిస్తున్న ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.