రాష్ట్రంలో ఆర్టీసీ(TSRTC), విద్యుత్ ఛార్జీల(ELECTRICITY CHARGES) పెంపు ప్రతిపాదనను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(TPCC PRESIDENT REVANTH REDDY) తప్పుబట్టారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీ, విద్యుత్తు సంస్థలను దృష్టిలో ఉంచుకుని ఛార్జీలు పెంచేందుకు తగిన ప్రతిపాదనలు తయారు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆయా సంస్థలకు సూచించింది. దీనిపై స్పందించిన రేవంత్ రెడ్డి.. ఆ ప్రతిపాదనను ట్విట్టర్(TWITTER) ద్వారా తప్పుబట్టారు.
దేశంలో విద్యుదుత్పత్తి పెరిగి, తక్కువ ధరకే విద్యుత్ లభిస్తున్న నేపథ్యంలో వినియోగదారులకు ఛార్జీలు తగ్గించాల్సింది పోయి భారం మోపడం సరికాదని రేవంత్ హితవు పలికారు. ఇలా చేయడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనం కాదా.. అని ప్రశ్నించారు. తెరాస(TRS) పాలనలో పతనమైన వ్యవస్థల దుష్ఫలితమా.? అని నిలదీశారు. పెట్రో ఉత్పత్తులపై ప్రభుత్వం వేస్తున్న పన్ను ద్వారా ఆర్టీసీ వెన్ను విరిచిన విషయం వాస్తవం కాదా అని సీఎం కేసీఆర్(CM KCR)ను ట్విట్టర్ ద్వారా రేవంత్ ప్రశ్నించారు.
ఇదీ చదవండి: KTR: 'రూ.3,866 కోట్లతో హైదరాబాద్‌లో మురుగునీరు శుద్ధి ప్లాంట్'