ETV Bharat / state

'దుబ్బాక ఎన్నికల కోసమే కేసీఆర్​ ప్రారంభోత్సవాలు చేస్తున్నారు' - సీఎం కేసీఆర్​పై ఈసీకి టీపీసీసీ ఫిర్యాదు

అధికారిక ప్రారంభోత్సవాల పేరిట సీఎం కేసీఆర్​... దుబ్బాక ఎన్నికల ప్రచారాన్ని పరోక్షంగా నిర్వహిస్తున్నారని టీపీసీసీ ఎన్నికల కమిషన్​ సమన్వయ కమిటీ కన్వీనర్​ నిరంజన్​ ఆరోపించారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన కేసీఆర్​పై చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరాకు ఫిర్యాదు చేశారు.

tpcc letter to election commission on cm kcr
'ప్రారంభోత్సవాల పేరిట కేసీఆర్.. దుబ్బాక కోసం​ ప్రచారం చేస్తున్నారు'
author img

By

Published : Nov 2, 2020, 10:00 AM IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌ దుబ్బాక ఎన్నికల ప్రచారానికి వెళ్లకుండా పక్క జిల్లాలో అధికారికంగా ప్రారంభోత్సవాల పేరిట బహిరంగ సమావేశాలు ఏర్పాటు చేసి ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని టీపీసీసీ ఎన్నికల కమిషన్‌ సమన్వయ కమిటీ కన్వీనర్‌ నిరంజన్‌ ఆరోపించారు. తద్వారా ఎన్నికల నియమాలను ఉల్లఘించారని మండిపడ్డారు. గత నెల 29న మేడ్చల్‌ మల్కాజిగిరిలోని మూడుచింతల గ్రామంలో కేసీఆర్​ ధరణి పోర్టల్‌ ప్రారంభించి, వేదికపై... దుబ్బాకలో తెరాస ఘన విజయం సాధిస్తుందని ప్రకటించారని పేర్కొన్నారు. అంతే కాకుండా సాదా బైనామాలను రెగ్యులరైజ్‌ చేసుకోవడానికి మరో వారం గడువు ఇస్తామనే విధాన నిర్ణయాన్ని ప్రకటించారన్నారు.

వ్యూహాత్మకంగానే కేసీఆర్‌... సిద్దిపేట పక్క జిల్లాల్లో రెండు అధికార సభలు ఏర్పాటు చేసి దుబ్బాక ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రయత్నించారని ఆరోపించారు. ఈ మేరకు సీఎంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర ఎన్నికల కమిషనర్‌ సునీల్ అరోరాకు లేఖ రాశారు.

ఇదీ చదవండి: నష్టనివారణ చర్యలపై ఆర్టీసీ యాజమాన్యం దృష్టి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.