ETV Bharat / state

huzurabad by election: హుజూరాబాద్‌ ఉపఎన్నికలో పోటీకి దరఖాస్తులు ఆహ్వానించిన కాంగ్రెస్‌ - తెలంగాణ కాంగ్రెస్​ తాజా వార్తలు

హుజూరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆశావహులు రేపటి నుంచి గాంధీభవన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్​కుమార్‌ గౌడ్‌ స్పష్టం చేశారు. సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి అదోదో తారీఖు సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు వెల్లడించారు.

Pcc Working President
Pcc Working President
author img

By

Published : Aug 31, 2021, 7:09 PM IST

హుజూరాబాద్ ఉప ఎన్నికపై కాంగ్రెస్ దృష్టిసారించింది. ఆశావహుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. దరఖాస్తుతో పాటు రూ.5వేలు డీడీ కూడా ఇవ్వాలని, ఆరో తేదీన పీసీసీ సీనియర్ల బృందం వారిని ఇంటర్వ్యూ చేస్తుందని తెలిపారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పీసీసీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌ దామోదర్ రాజనర్సింహ, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, వరంగల్ డీసీసీ ప్రెసిడెంట్ నాయిని రాజేందర్ రెడ్డి, కరీంనగర్ డీసీసీ ప్రెసిడెంట్ కవ్వంపల్లి సత్యనారాయణలు ఈ కమిటీ సభ్యులుగా వుంటారని వివరించారు. సెప్టెంబరు పదో తేదీ తరువాత ఏఐసీసీకి నివేదిక వెళ్తుందని, ఆ తరువాత అభ్యర్థి పేరు ప్రకటిస్తారని వివరించారు. భాజపా అధ్యక్షుడు బండి సంజయ్.. నిజాం ఆస్తుల విషయం తీసుకొచ్చి మతాలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. ఏడేళ్లుగా మోదీ సర్కారుకు నిజాం ఆస్తులు కనిపించలేదా అని నిలదీశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆడుతున్నాయని విమర్శించారు.

బండి సంజయ్​ను కట్టడి చేయాలి

విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను కట్టడి చేయాలని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్‌ కోరారు. పాదయాత్రలో భాగంగా మత విద్వేషాలు రెచ్చగొట్టి రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా వ్యాఖ్యలు చేస్తున్నారని నిరంజన్ ఆరోపించారు. ఈ మేరకు డీజీపీ మహేందర్ రెడ్డికి రాసిన లేఖలో సంజయ్​ను కట్టడి చేసి... ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా చూడాలని కోరినట్లు తెలిపారు.

ఆ భూములు స్వాధీనం చేసుకోడానికి పాదయాత్ర ఎందుకు

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన పాదయాత్ర మత రాజకీయాలు రెచ్చగొట్టడానికే కాని.... ప్రజల కోసం కాదని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ధ్వజమెత్తారు. 80శాతం హిందూ ప్రజల కోసం పెట్రోల్, డీజిల్‌, గ్యాస్ ధరలు తగ్గించే ధైర్యముందా అని ప్రశ్నించారు. కేసీఆర్‌ను జైలుకు పంపుతామంటున్న భాజపాను ఎవరు అడ్డుకుంటున్నారని నిలదీశారు. నిజాం భూములను స్వాధీనం చేసుకోడానికి పాదయాత్ర ఎందుకన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా భాజపా పావులు కదుపుతోందని... దీనికి తెరాస, వైఎస్​ఆర్​టీపీ పావులుగా పనిచేస్తున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీ కూడా పాదయాత్ర చేస్తుందని... మేము పాదయాత్ర చేస్తే బండి సంజయ్‌ అందులో కొట్టుకుపోతారన్నారు. కాంగ్రెస్ పాదయాత్రపై త్వరలో వివరాలు వెల్లడిస్తానని తెలిపారు. గంజాయి మత్తులో ఉన్న యువతను భాజపా, ఎంఐఎం మత రాజకీయాలకు వాడుకుంటున్నాయన్నారు. విజయమ్మ కొత్త నాటకానికి తెరలేపిందని... కూతురితో కలిసి విజయమ్మ మళ్లీ తెలంగాణకు వస్తుందన్నారు.

ఇదీ చూడండి: MLA SRIDHAR BABU: బరిలో ఎవరూ నిలిచినా... గెలిపించేందుకు కృషి చేస్తా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.