ETV Bharat / state

'పాల్వాయి హరీశ్​ను బహిష్కరిస్తున్నాం' - టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ కోదండరెడ్డి

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ నుంచి పాల్వాయి హరీశ్​ను బహిష్కరించింది.

tpcc Disciplinary Committee boycotting Palwai Harish
'పాల్వాయి హరీశ్​ను బహిష్కరిస్తున్నాం'
author img

By

Published : Feb 23, 2021, 6:53 AM IST

పార్టీ నుంచి పాల్వాయి హరీశ్​ను బహిష్కరిస్తునట్లు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ కోదండరెడ్డి ప్రకటించారు. పార్టీ నిబంధనలు ఉల్లంఘించినందుకు.. నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. మంగళవారం హరీశ్​.. కమల తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమవుతుండటంతో.. కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

పాల్వాయి హరీశ్​.. కాంగ్రెస్ అభ్యర్థిగా 2018 అసెంబ్లీ ఎన్నికలో సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి పోటీ చేశారు. ప్రముఖ నేతల వరుస రాజీనామాలతో ఇప్పటికే ఆ పార్టీ బలహీనపడుతూ వస్తోంది.

ఇదీ చదవండి: రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్ల సందడి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.