ETV Bharat / state

పోలింగ్​ శాతం పెరగడంపై కాంగ్రెస్​ అనుమానం - గాంధీ భవన్​

పార్లమెంటు ఎన్నికల పోలింగ్​పై కాంగ్రెస్​ అనుమానం వ్యక్తం చేసింది. సమయం ముగిసిన తర్వాత పోలింగ్ శాతం పెరగడమేంటని కాంగ్రెస్​ ఎన్నికల సమన్వయ కమిటీ ప్రశ్నించింది. గాంధీభవన్​లో జరిగిన సమావేశంలో నియోజకవర్గాల వారీ పోలింగ్​ శాతంపై పార్టీ నేతలు చర్చించారు.

కాంగ్రెస్​ సమావేశం
author img

By

Published : Apr 15, 2019, 7:52 PM IST

తెలంగాణలో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో పోలింగ్‌ శాతం పెరగడంపై పీసీసీ ఎన్నికల సమన్వయ కమిటీ అనుమానాలు వ్యక్తం చేసింది. గాంధీభవన్​లో సమన్వయ కమిటీ ఛైర్మన్​ మర్రి శశిధర్​రెడ్డి నేతృత్వంలో జరిగిన సమావేశంలో నియోజక వర్గాల వారీ పోలింగ్​ శాతాలపై కాంగ్రెస్​ నాయకులు చర్చించారు. ఏ పరిస్థితుల్లో పోలింగ్​ శాతం పెరిగిందన్న కారణాలపై సమీక్షించారు.

ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్​ది

పోలింగ్​ ప్రక్రియ ఎంత పారదర్శకంగా జరిగిందో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్​ మీద ఉందన్నారు ఛైర్మన్​ మర్రి శశిధర్​రెడ్డి. చేవెళ్ల మినహా మిగిలిన 16 నియోజక వర్గాల్లో పోలింగ్​ శాతం పెరగడానికి గల కారణాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు.
ప్రతి కేంద్రంలో ప్రిసైడింగ్​ అధికారి పోలింగ్​ శాతాన్ని నివేదించాల్సి ఉండగా... కొందరు నివేదించలేదని ఆరోపించారు. అలాంటి అధికారులపై ఈసీ చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు.

గాంధీభవన్​లో సమావేశమైన కాంగ్రెస్ సమన్వయ కమిటీ

ఇదీ చదవండి : సాగు నీటికోసం రోడ్డెక్కిన రైతులు

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.