సిద్దిపేట జిల్లా సీఎం నియోజకవర్గం వర్గల్ మండలం వేలూరుకు చెందిన బ్లాగరి నర్సింహులు ఆత్మహత్యకు కారణమైన అందరిపైనా హత్యకేసు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీలపై రోజు రోజుకూ దాడులు పెరుగుతున్నాయని ఉత్తమ్ ఆరోపించారు. కేసీఆర్ దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని మోసం చేసి వారిని బలి తీసుకుంటున్నారని విమర్శించారు.
బడుగు బలహీన వర్గాలు ఏకం కావాలని తెరాస పాలన అంతం అయ్యేంత వరకు న్యాయం జరగదన్నారు. నర్సింహులుకు చెందిన 13 గుంటల భూమిని బలవంతంగా రైతు వేదిక నిర్మాణానికి తీసుకుంటున్నారని ఆవేదన చెంది పురుగుల మందు తాగి చనిపోయాడని తెలిపారు. ఇటీవలే భూపాలపల్లి జిల్లా మల్లారంలో యువకుడు రాజబాబును గులాబీ కార్యకర్తలు హత్య చేశారని ఆరోపించారు. ప్రజలంతా ఏకమై పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటన విడుదల చేశారు.