ETV Bharat / state

బీజేపీ, బీఆర్ఎస్​లో ఉంటే పవిత్రులు - ప్రతిపక్షంలో ఉంటే ద్రోహులా? : రేవంత్ రెడ్డి - తెలంగాణలో ఈడీ దాడులపై రేవంత్ వ్యాఖ్యలు

Revanth Reddy Open Letter to Public : రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలపై జరుగుతున్న ఐటీ, ఈడీ దాడుల నేపథ్యంలో టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కై ఇలాకాంగ్రెస్ నేతల ఇళ్లలో దాడులు చేయిస్తున్నారంటూ ఆరోపించారు.

TPCC Chief Revanth Reddy on Telangana Development
TPCC Chief Revanth Reddy Open Letter to Public
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 24, 2023, 1:53 PM IST

Revanth Reddy Open Letter to Public : దేశంలోని అత్యున్నత ప్రభుత్వ సంస్థలు.. రాజ్యాంగ వ్యవస్థలను మోదీ, కేసీఆర్ రాజకీయ క్రీడలో పావులుగా మార్చేశారని టీపీసీసీ ఛీఫ్ రేవంత్​రెడ్డి ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ నాయకుల ఇళ్లలో ఐటీ, ఈడీ దాడులు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కై కాంగ్రెస్ నేతల ఇళ్లపై ఐటీ, ఈడీ దాడులు చేయిస్తున్నారంటూ విమర్శించారు. ఆ రెండు పార్టీల్లో చేరిన వారు పవిత్రులు.. ప్రతిపక్షంలో ఉండి ప్రజల తరఫున కొట్లాడే వాళ్లు ద్రోహులా అంటూ ప్రశ్నించారు.

Revanth Reddy Fires on CM KCR : రాష్ట్రంలో ప్రతిపక్షమే ఉండకూడదని.. ప్రశ్నించే గొంతులే మిగలకూడదన్నట్లుగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని లేఖలో రేవంత్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నాయకులే టార్గెట్​గా ఈడీ, ఐటీ దాడులు ఎందుకు జరుగుతున్నాయని ప్రశ్నించారు. బీజేపీ - బీఆర్ఎస్ మధ్య కుదిరిన కామన్ మినిమమ్ ప్రోగామని అన్నారు. కాంగ్రెస్ నేతలను వేధించాలన్న ఆదేశాలు ఈడీ, ఐటీ సంస్థలకు ఎక్కడ నుంచి అందుతున్నాయని.. వీటి వెనుక ఉన్న ఆదృశ్య హస్తాలు ఎవరివని నిలదీశారు.

ఈసారి రెండుచోట్ల కేసీఆర్‌కు ఓటమి తప్పదు: రేవంత్‌రెడ్డి

'గడచిన పదేళ్లలో మోదీ - షా ఆదేశాలు లేకుండా ఈడీ, ఐటీ సంస్థల్లో చీమచిటుక్కుమన్నది లేదు. కాంగ్రెస్ నేతల ఇళ్లపై జరుగుతోన్న దాడుల వెనుక ఎవరున్నారో తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్ గెలుపు అవకాశాలు పెరుగుతున్న కొద్ది... ఈడీ, ఐటీ దాడులూ పెరుగుతున్నాయి. అమిత్ షా - కేసీఆర్ కలిసి ప్రణాళిక రచించడం.. పీయూష్ గోయల్, కేటీఆర్ కలిసి దాన్నీ అమలు చేయడం.. ఇదే కదా జరుగుతున్నది. ప్రతి రోజు సూర్యుడు అస్తమించగానే... వీళ్ల కుట్రలకు పథక రచన జరుగుతోంది.' - రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్

Revanth Reddy Fires On BJP : కేసీఆర్​కు వందల కోట్లు విరాళాలు ఇచ్చిన వ్యక్తుల జోలికి దర్యాప్తు సంస్థలు ఎందుకు వెళ్లడం లేదని రేవంత్ ప్రశ్నించారు. కాళేశ్వరం కుంగి అనినీతి బట్టబయలైతే కేసీఆర్​ను ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులైన పొంగులేటి, కేఎల్ఆర్, తుమ్మల ఇళ్లపై మాత్రం దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. తాజాగా వివేక్ వెంకటస్వామి ఇళ్లు, కార్యాలయాలపై ఈడీ అధికారులు విరుచుకుపడుతున్నారని.. బీజేపీ పార్టీలో ఉన్నప్పుడు కనిపించని పన్ను ఎగవేతలు.. కాంగ్రెస్ పార్టీలోకి చేరగానే అనిపించాయా అని రేవంత్ ప్రశ్నించారు.

దుబ్బాక నిధులను మామా, అల్లుళ్లు సిద్దిపేటకు ఎత్తుకుపోవడం అలవాటైపోయింది : రేవంత్​రెడ్డి

'పోటీ చేసే అభ్యర్థుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై కూడా ఉంది. నేను బీజేపీ – బీఆర్ఎస్ పార్టీలను హెచ్చరిస్తున్నా. మీ పతనం మొదలైంది. మీ క్షుద్ర రాజకీయాలకు కాలం చెల్లింది. మీ కవ్వింపు చర్యలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో మరింత కసిని పెంచాయి. వివేక్ వెంకటస్వామి కుటుంబంపై దాడి కాంగ్రెస్ పార్టీ పై జరిగిన దాడిగా భావిస్తాం. వారికి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అండగా ఉంటుంది.ఎన్ని ఇబ్బందులు పెట్టినా, మరెన్ని దాడులు చేసినా రేపటి ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపును ఆపలేరు.' అని రేవంత్ లేఖలో పేర్కొన్నారు.

బీఆర్ఎస్ నేతలు దిల్లీ గులాములు కాదు - మాకు ప్రజలే బాసులు : కేసీఆర్

రాష్ట్రంలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్న కాంగ్రెస్​ - రంగంలోకి దిగుతున్న అగ్రనేతలు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.