TPCC Chief Revanth Reddy Meet the Press : కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సచివాలయంలో ప్రజా దర్బార్ నిర్వహిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో రేవంత్‌రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఈ నేపథ్యంలో బీజేపీ, బీఆర్ఎస్పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గత ఎన్నికల్లో బీజేపీకు 105 స్థానాల్లో డిపాజిట్లు గల్లంతయ్యాయని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో 110 స్థానాల్లో డిపాజిట్లు గల్లంతు అవుతాయని ఎద్దేవా చేశారు.
Revanth Reddy at Meet the Press Program Hyderabad : డిపాజిట్లు రాని పార్టీ.. రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రిని ఎలా చేస్తుందని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. బీజేపీ 10 రాష్ట్రాల్లో అధికారంలో ఉంటే.. ఒకరు మాత్రమే ఓబీసీ సీఎం ఉన్నారని ఆయన తెలిపారు. బీసీ గణన(BC Caste Pole) చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్నా బీజేపీ పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీగణన చేయలేని పార్టీ బీసీ సీఎంను ఎలా చేస్తుందని నిలదీశారు. ఎన్నికల కోసమే బీజేపీ ఎస్సీ వర్గీకరణ హామీ ఇస్తుందని వ్యాఖ్యానించారు.
తెలంగాణ ప్రస్థానాన్ని మూడు భాగాలుగా చూడాల్సి ఉంటుందని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. నిజాం నిరంకుశ పాలన.. సమైక్య పాలకుల ఆధిపత్యం.. తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన విధ్వంసమని అన్నారు. తెలంగాణ చరిత్ర చూస్తే.. ఆకలినైనా భరించింది కానీ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టలేదని గుర్తుచేశారు. అందుకే నాడు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాయుధ రైతాంగ పోరాటం జరిగిందని పేర్కొన్నారు. సమైక్య రాష్ట్రంలో సమాన అభివృద్ధి, సమాన అవకాశాలు దక్కలేదని విమర్శించారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రజలను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూశారని ఆరోపించారు. అందుకే స్వేచ్ఛ, సమానత్వం, సమాన అభివృద్ధి కోసం తెలంగాణ ప్రజలు ఉద్యమించారని(People War) పేర్కొన్నారు.
రాష్ట్రమంతటా కాంగ్రెస్ గాలి - 75 నుంచి 78 స్థానాలతో ప్రభుత్వ ఏర్పాటు పక్కా : భట్టి విక్రమార్క
Revanth Reddy Fires on CM KCR : కొట్లాడి తెలంగాణ సాధించుకున్నామని.. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ఆధిపత్య ధోరణితోనే ముందుకు వెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్లుగా తెలంగాణ ప్రజలు కోరుకున్న స్వేచ్ఛ, సమానత్వం, సమాన అభివృద్ధి అందలేదన్నారు. అందుకే మరోసారి ఉద్యమించాల్సిన పరిస్థితి తెలంగాణలో ఏర్పడిందని స్పష్టం చేశారు. నిరంకుశ నిజాంకు పట్టిన గతే కల్వకుంట్ల కుటుంబానికి(KCR Family) తెలంగాణ ప్రజలు రుచి చూపించబోతున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చెందుకే కాంగ్రెస్ మేనిఫెస్టోను రూపొందించామని వెల్లడించారు. ప్రజలు ఇచ్చే తీర్పుకు కొలబద్దగా పాలసీ డాక్యుమెంట్‌ను ప్రజల ముందుంచామని తెలిపారు. తుది దశ తెలంగాణ ఉద్యమంలో మీడియా ముందుభాగాన నిలవాలని సూచించారు.
'కేసీఆర్‌కు రైతు రుణమాఫీ చేయాలన్న చిత్తశుద్ధి లేదు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతాం.. అందులో అనుమానం లేదు. అధికారం కోల్పోతున్నామన్న విచక్షణ కోల్పోయి కేసీఆర్, కేటీఆర్, హరీశ్, కవిత మాట్లాడుతున్నారు. తెలంగాణ ఏర్పాటు ఖాయమైనప్పుడు సీమాంధ్ర పాలకులు మాట్లాడినట్లు ఇవాళ వాళ్లు మాట్లాడుతున్నారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక రేషనలైజేషన్ పేరుతో 12 వేల పాఠశాలలు మూసేశారు. ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో ఖాళీలను భర్తీ చేయలేదు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తాం. యూపీఎస్సీ తరహాలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తాం.' -రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు
సమయం దగ్గరకు వస్తోంది- నాయకుల్లో జోరు పెరిగింది, పోటా పోటీగా ప్రచారం చేస్తున్న నేతలు
కేసీఆర్‌ను గద్దె దించాలి : ప్రజలను బానిసలుగా చూస్తున్న కేసీఆర్‌ను గద్దె దించాలని రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజలకు ఇదే చివరి ఉద్యమం కావాలని సూచించారు. ఈ ఉద్యమం పరిపాలన కోసమని, అధికారం కోసం కాదని.. తెలంగాణ ఆత్మగౌరవం కోసమన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు విస్పష్టమైన తీర్పు ఇవ్వబోతున్నారని పేర్కొన్నారు. కేసీఆర్‌కు ఫెడరల్ స్ఫూర్తి తెలియదని.. ఆయన రాచరికం అనుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రాల ఆదాయం(State Income) ఆధారంగా ప్రాధాన్యతలు ఉంటాయని తెలిపారు. ధరణి పేరుతో పెద్ద ఎత్తున భూ దోపిడీ జరిగిందని ధ్వజమెత్తారు.
Revanth Reddy Comments on KCR Government : హైదరాబాద్ చుట్టూ ఉన్న లక్ష ఎకరాల నిజాం వారసుల భూములు చేతులు మారాయని రేవంత్‌రెడ్డి విమర్శించారు. అందుకే ధరణి రద్దు చేస్తామంటే కేసీఆర్‌కు దుఃఖం వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ సీఎం హోదాలో అబద్ధాలు చెప్పి ప్రజల్ని నమ్మించాలని చూస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదని కేసీఆర్ దుష్ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కేసీఆర్ ఇస్తున్న విద్యుత్ కొంటున్నది కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఛత్తీస్‌గఢ్ నుంచి కాదా? అని రేవంత్ ప్రశ్నించారు. సొంతంగా విద్యుత్ ఉత్పత్తి చేయలేని కేసీఆర్.. కాంగ్రెస్‌పై అసత్య ఆరోపణలు చేస్తున్నారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు.
రేపు రాష్ట్రానికి రానున్న ప్రియాంక గాంధీ - ఇదే ఎన్నికల ప్రచార షెడ్యూల్
పోస్టల్ బ్యాలెట్ వినియోగానికి సర్వం సిద్ధం - పోలింగ్‌కు ముందుగానే ఓటేసే అవకాశం