ETV Bharat / state

సీఎం ఫొటో లేదని బ్రోచర్ ఆవిష్కరణకు తిరస్కరించిన మంత్రి

మహబూబ్​నగర్​లో నిర్వహించబోయే ఏరో స్పోర్ట్స్ బ్రోచర్ ఆవిష్కరణను పర్యటక శాఖ మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ తిరస్కరించారు. సీఎం ఫొటోలేదని బ్రోచర్‌ను ఆవిష్కరించలేదు.

tourism minister srinivas goud reject airo sports brocher release
ఏరో స్పోర్ట్స్ బ్రోచర్ ఆవిష్కరించని మంత్రి శ్రీనివాస్​ గౌడ్​
author img

By

Published : Jan 11, 2021, 12:42 PM IST

Updated : Jan 11, 2021, 2:23 PM IST

హైదరాబాద్‌లో కైట్, స్వీట్ ఫెస్టివల్ నిర్వహించట్లేదని పర్యటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. కరోనా వల్ల సంక్రాంతికి కైట్, స్వీట్ ఫెస్టివల్ నిర్వహించట్లేదని ప్రకటించారు. దేశంలోనే తొలిసారిగా మహబూబ్‌నగర్‌లో ఏరో స్పోర్ట్స్ పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. అయితే బ్రోచర్‌పై సీఎం ఫొటోలేదని ఏరో స్పోర్ట్స్ బ్రోచర్ ఆవిష్కరణను మంత్రి తిరస్కరించారు.

ఈ నెల 13 నుంచి 17 వరకు ఏరో స్పోర్ట్స్ నిర్వహిస్తామని... ఈ పోటీల్లో 15 దేశాల ప్రతినిధులు పాల్గొంటారని పేర్కొన్నారు. ఏరో స్పోర్ట్స్‌లో పారామోటార్, స్కై డైవింగ్ ఉంటాయని తెలిపారు. ఏరో స్పోర్ట్స్ వీక్షించేందుకు ప్రత్యేక హెలికాప్టర్ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. హైదరాబాద్‌ నుంచి మహబూబ్‌నగర్‌కు హెలికాప్టర్ సౌకర్యం ఉంటుందన్నారు. ప్రతి జిల్లా కేంద్రానికి పర్యటక శాఖ ప్రణాళిక విడుదల చేస్తుందని తెలిపారు. సినీ పరిశ్రమ కోసం ప్రత్యేకంగా బ్రోచర్లు తయారుచేస్తున్నామన్నారు. త్వరలోనే నాగార్జునసాగర్ బుద్ధవనం ప్రారంభిస్తామని శ్రీనివాస్ గౌడ్ ప్రకటించారు.

సీఎం ఫొటో లేదని బ్రోచర్ ఆవిష్కరణకు తిరస్కరించిన మంత్రి

ఇదీ చదవండి: 'చంటి' ఆ హీరోతో తీద్దామనుకున్నారట.. కానీ!

Last Updated : Jan 11, 2021, 2:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.