1. కొత్తగా మరో 574
రాష్ట్రంలో కొత్తగా 574 మందికి కరోనా సోకింది. తాజాగా మరో ఇద్దరు మృతిచెందారు. రాష్ట్రంలో ప్రస్తుతం 6,815 కొవిడ్ యాక్టివ్ కేసులున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. గంటలోనే... మెరుగైన చికిత్స
రోడ్డు ప్రమాదాల్లో మరణాల తగ్గింపునకు పోలీసు శాఖ కసరత్తు చేస్తోంది. ప్రమాదం జరిగిన మొదటి గంటలోపే క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. నిమ్స్‌లో జన్యువిశ్లేషణ కేంద్రం
కరోనా కొత్త రకం వైరస్ అలజడితో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. నిమ్స్‌లో జన్యువిశ్లేషణ కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. యూకే, యూకే మీదుగా వచ్చిన ప్రయాణికులు.. పరీక్షలకు స్వచ్ఛందంగా ముందుకురావాలని వైద్య ఆరోగ్య శాఖ విజ్ఞప్తి చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. పాడి పాట్లు
కరోనా కారణంగా రైతులు ఆర్థికంగా చతికిలబడిపోయారు. ఈ నేపథ్యంలో ఎలాంటి పూచీకత్తు అడగకుండా కిసాన్ క్రెడిట్ కార్డు కలిగిన రైతులకు రూ.3 లక్షల రుణమివ్వాలని కేంద్రం బ్యాంకులను ఆదేశించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. మరో 24,712 మందికి కరోనా
దేశంలో కరోనా కేసులు మరోసారి స్వల్పంగా పెరిగాయి. కొత్తగా 24,712 మంది వైరస్ బారినపడ్డారు. మరో 312 మంది కొవిడ్ బారిన పడి మృతి చెందారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6. కాలుష్యం కాటుకు నీరే గరళం!
గాలి తరవాత అత్యంత వేగంగా కలుషితమవుతోన్న ప్రకృతి వనరు నీరే అనేది కాదనలేని సత్యం. భూమిపై ఉన్న నదులు, కాలువలు, సరస్సులు, చెరువులు, ఏరులతోపాటు భూగర్భ జలాలూ వేగంగా కలుషితమవుతున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7. మసీదు స్థలంపై వివాదం
అయోధ్యలో భారీ మసీదు నిర్మాణం కోసం కేటాయించిన స్థలంపై ముస్లిం వర్గాల్లో వివాదం రాజుకుంది. ఆ స్థలంలో మసీదు నిర్మాణం చేపట్టడం అక్రమమంటూ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యుడు జఫర్యబ్ జిలానీ అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8. లాభాల్లో మార్కెట్లు
స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్ మార్కెట్ సూచీ సెన్సెక్స్ 313 పాయింట్లు వృద్ధి చెంది.. 46,739 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. రెండు షేర్లు మినహా సెన్సెక్స్ 30లో అన్నీ లాభాల్లోనే పయనిస్తున్నాయి. లోహపు షేర్లు రాణిస్తున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9. కంగన కౌంటర్
తన బికినీ ఫొటోపై కామెంట్లు చేసిన నెటిజన్లపై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మండిపడింది. మతం మీద అధికారం ఉన్నవాళ్లలా నటించొద్దని విరుచుకుపడింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10. మార్పుల్లేకుండానే ఆసీస్
టీమ్ఇండియాతో ఈనెల 26న ప్రారంభమయ్యే రెండో టెస్టులో పాత జట్టుతోనే బరిలో దిగుతామని వెల్లడించాడు ఆస్ట్రేలియా జట్టు కోచ్ జస్టిన్ లాంగర్. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.