1. తెలంగాణ.. ఒప్పందాలు ఉల్లంఘిస్తోంది
కృష్ణాజలాల అంశంపై తెలంగాణ హైకోర్టులో ఏపీ రైతు పిటిషన్ దాఖలు చేశారు. హౌస్‌మోషన్ పిటిషన్ వేసిన ఆ రైతు... ప్రభుత్వం ఒప్పందాలను ఉల్లంఘిస్తోందంటూ వ్యాజ్యంలో పేర్కొన్నారు. జూన్ 28న తెలంగాణ జారీ చేసిన జీవోను సస్పెండ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2.ఎస్బీఐ ఏటీఎంలో వింత సమస్య
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) ఏటీఎంలో వింత సమస్య తలెత్తింది. రాంనగర్‌లోని ఎస్‌బీఐ ఎటీఎంలో కస్టమర్లు నగదు విత్‌డ్రా చేస్తే వారి ఖాతాల నుంచి కాకుండా బ్యాంకు మూలధనం నుంచి డబ్బులు డెబిట్ అయ్యాయి. ఈ విధంగా రూ.3.40 లక్షలు విత్‌డ్రా జరిగింది. సాఫ్ట్‌వేర్ లోపంతో సాంకేతిక ఆధారాలు లభించలేదు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
3. టీకా పంపిణీలో మరో మైలురాయి
టీకా పంపిణీలో భారత్ మరో ఘనత సాధించింది. మొత్తం మీద 35కోట్లకుపైగా టీకాలను పంపిణీ చేసింది. అటు దేశంలో కొత్తగా 43,071 కరోనా కేసులు నమోదయ్యాయి. 52,299 మంది కోలుకోగా 955మంది మృతిచెందారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. పాత మందులకు కొత్త పదును
కరోనాకు కొత్త మందులు కనుగొనే లోపు ఎబోలా, హెచ్‌ఐవీ, ఇన్‌ఫ్లుయెంజా వంటి రోగాలకు వాడుతున్న పాత మందులను తగు మార్పుచేర్పులతో ఉపయోగిస్తున్నారు. గతంలో క్యాన్సర్ చికిత్సకు డీఆర్డీఓ రూపొందించిన 2డీజీ పొడి ఒక మోస్తరు నుంచి తీవ్ర లక్షణాలున్న కొవిడ్ రోగులపై సమర్థంగా పనిచేస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. సముద్రంలో సాగు...
ఎక్కువగా కురిసినా వరదలొస్తాయన్న చింత ఉండదు.. పంటకి తెగుళ్లొస్తాయని కానీ పెట్టుబడి ఖర్చు పెరిగిపోతోందని కానీ ఆందోళన అక్కర్లేదు.. సీజన్‌తో నిమిత్తం లేకుండా ఏ పంట కావాలంటే ఆ పంట పండించొచ్చు.. ఎక్కడుందీ అలాంటి బంగారులోకం అంటే- సముద్రం లోపల. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6. కంటి చికిత్సకు కొత్త విధానం
నేత్రాలకు సంబంధించిన ఫంగల్ ఇన్ఫెక్షన్ నివారణకు పెప్టైడ్ ఆధారిత శీలీంధ్ర నాశక విధానాన్ని రూపొందించారు ఐఐటీ దిల్లీ పరిశోధకులు. కుసుమా స్కూల్ ఆఫ్ బయోలాజికల్ సైన్సెస్‌కు చెందిన ప్రొఫెసర్ అర్చనా చుగ్ నేతృత్వంలో దిల్లీ ఐఐటీ మహిళా పరిశోధకుల బృందం ఈ విధానాన్ని రూపొందించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7. పరిశ్రమలో ప్రమాదం
మహారాష్ట్ర పాల్గఢ్ జిల్లాలోని ఓ రసాయన సంస్థలో పేలుడు జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు కార్మికులు గాయపడినట్లు అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8. ధరల వాత తప్పదా..?
దేశంలో ఇప్పటికే పెట్రోల్, నిత్యవసరాల ధరలు భగ్గుమంటున్నాయి. రానున్న రోజుల్లో ఈ భారం మరింత పెరగొచ్చని ఆంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎఫ్ఎంసీజీ కంపెనీలు త్వరలో తమ ఉత్పత్తుల ధరలను పెంచే ఆవకాశం ఉందని పలు విశ్లేషణలు స్పష్టం చేస్తున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9. పారా ఒలింపిక్స్‌కు వెళ్లేది వీరే
పారా ఒలింపిక్స్‌కు వెళ్లనున్న 24 మంది సభ్యుల జాబితాను విడుదల చేసింది భారత పారా ఒలింపిక్ కమిటీ. రియో ఒలింపిక్స్‌లో స్వర్ణాలు గెలిచిన మరియప్పన్ తంగవేలుతో పాటు దేవేంద్ర జజారియా వంటి ఆటగాళ్లు ఈ లిస్టులో ఉన్నారు. టోక్యో వేదికగా ఆగస్టు 24 నుంచి పారాలింపిక్స్ ప్రారంభం కానున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10. ఆమె గానం సుముధరం
ఆ స్వరం.. ఓ సమ్మోహన గళం.. ఆ గానం పాటకు పన్నీటి స్నానం.. ఆమె గీతం మనసు తాకే మధుర తుషారం. సంగీత లక్ష్మి సిగలో తురిమిన కాంతి లతాంతం. చక్రవాకాలు దాచుకుని అమృతం కురిపించే అమృత వర్షిణి. తొలి పొద్దులో భూపాలం. మలి సంజెలో దీపక రాగం. సప్త స్వరాలకు లతలా అల్లుకుని గాన మకరందాన్ని పంచుతున్న గాన వర్షిణి లతామంగేష్కర్. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.