ETV Bharat / state

టాప్​టెన్​ న్యూస్​ @11AM - top ten news till now

ఇప్పటివరకు ఉన్న ప్రధానవార్తలు

TOP TEN NEWS
టాప్​టెన్​ న్యూస్​ @11AM
author img

By

Published : Jun 8, 2021, 11:00 AM IST

Updated : Jun 8, 2021, 2:49 PM IST

  • రద్దీగా చేపల మార్కెట్లు

మృగశిర కార్తె కావడంతో చేపలు కొనుగోలు చేసేందుకు ప్రజలు ఎగబడ్డారు. మార్కెట్లలో భౌతిక దూరం సైతం కొనుగోలుదారులు పాటించడం లేదు. హైదరాబాద్​ రాంనగర్​ చేపల మార్కెట్​ కిటకిటలాడింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • లక్ష దిగువకు కేసులు

దేశంలో కరోనా కేసులు (Covid-19 cases) తగ్గుముఖం పడుతున్నాయి. కొత్తగా 86,498 మందికి కొవిడ్(covid-19 India) సోకింది. 66 రోజుల కనిష్ఠానికి కేసులు నమోవటం ఇదే తొలిసారి. వైరస్​ బారినపడి మరో 2123 మంది మరణించారు. 63 రోజుల తర్వాత కేసుల సంఖ్య లక్ష దిగువకు చేరింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • పేగులపైనా కరోనా ప్రభావం

మనిషి శరీరంలో కరోనా మహమ్మారి ప్రభావం చూపని భాగం లేదంటే అతిశయోక్తి కాదు. ఊపిరితిత్తులు, గుండె, కిడ్నీలు, మెదడు వంటి అవయవాలతోపాటు, జీర్ణకోశ వ్యవస్థలోనూ కరోనా వైరస్‌ పలు సమస్యలు తెచ్చిపెడుతోంది. వైరస్‌ ప్రభావంతో రక్తనాళాల్లో రక్తపు గడ్డలు ఏర్పడటంతో రక్తసరఫరా నిలిచిపోయి... కొందరిలో పేగులూ దెబ్బతింటున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • మూడో దశలో హైబ్రిడ్‌ వేరియంట్

కొవిడ్‌ మూడోదశపై అత్యంత అప్రమత్తంగా ఉండాలని... ఏడాదిన్నరగా పరిశోధన చేస్తున్న నిట్‌ ఆచార్యులు హెచ్చరిస్తున్నారు. ఊసరవెల్లి తరహాలో వైరస్ మార్పులకు గురవుతోందని తెలిపారు. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ముమ్మరం చేయడమే... సమస్యకు పరిష్కారమని సూచిస్తున్నారు.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ప్రధాని మోదీకి జగన్ లేఖ

ప్రధాని మోదీకి ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి జగన్ లేఖ రాశారు. పీఎంఏవై కింద గ్రీన్ ఫీల్డ్ కాలనీల్లో మౌలిక వసతులు కల్పనపై లేఖలో ప్రస్తావించారు. కాలనీల్లో మౌలిక సదుపాయాలకు తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • నడుస్తున్న బైకులో మంటలు

ప్రయాణంలో ఉన్న సమయంలో మంటలు చెలరేగి ఓ బైకు పూర్తిగా దగ్ధమైన ఘటన మధ్యప్రదేశ్​లో జరిగింది. సివనీ జిల్లాలోని ఛపారాలో పెట్రోల్​ బంక్​కు సమీపంలోనే బైకులో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. బైకు మీద నుంచి దూకి రైడర్​ ఎలాగోలా ప్రణాలు కాపాడుకోగలిగాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ఐరాస ఆర్థిక, సామాజిక మండలిలో భారత్

ఐరాస ఆర్థిక, సామాజిక మండలిలో భారత్​కు చోటు లభించింది. సోమవారం జరిగిన ఎన్నికల్లో 2022-24 కాలానికి సభ్య దేశంగా భారత్​ ఎన్నికైంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • క్యూర్‌ఫిట్‌లో టాటా పెట్టుబడులు

టాటా గ్రూప్​ సంస్థ టాటా డిజిటల్ పెట్టుబడుల విషయంలో దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇటీవలే బిగ్​ బాస్కెట్​ను సొంతం చేసుకున్న ఈ సంస్థ.. తాజాగా క్యూర్‌ఫిట్‌ హెల్త్‌కేర్‌లో రూ.550 కోట్లు పెట్టుబడిగా పెట్టనున్నట్లు తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • 'కోహ్లీసేనతో పోటీ కఠినమే'

ప్రపంచటెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్​లో(WTC Final) టీమ్​ఇండియాతో పోటీ కఠినంగా ఉంటుందని అన్నాడు న్యూజిలాండ్​ సారథి కేన్​ విలియమ్సన్(Kane Williamson)​. కోహ్లీతో కలిసి టాస్​కు రావడం సంతోషంగా ఉంటుందని వెల్లడించాడు. భారత జట్టు బౌలింగ్​ దాడి పటిష్టంగా ఉందని ప్రశంసించాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • బాలీవుడ్​లో తెలుగోడి జెండా

ఇటీవల విడుదలైన 'ది ఫ్యామిలీ మ్యాన్‌'(The Family Man 2) రెండో సీజన్​పై వ్యతిరేకత వచ్చినప్పటికీ సినీప్రియులను విశేషంగా అలరిస్తోంది. ఈ నేపథ్యంలో వెబ్​సిరీస్​ల స్థాయిని పెంచిన ఈ సిరీస్​ దర్శక ద్వయం రాజ్​ అండ్​ డీకే(Raj & Dk) సినీజర్నీపై ప్రత్యేక కథనం మీకోసం..పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

Last Updated : Jun 8, 2021, 2:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.