1. కరోనా కల్లోలం
దేశంలో కొవిడ్ విలయతాండవం కొనసాగుతూనే ఉంది. వరుసగా నాలుగో రోజూ 4లక్షలకుపైగా కొత్త కేసులు వెలుగుచూశాయి. వైరస్ సోకినవారిలో మరో 4,092 మంది చనిపోయారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. పల్లెలపై పంజా..
గ్రామాల్లో కరోనా విరుచుకుపడుతోంది. వైరస్‌పై అవగాహన లేకపోవడం, కరోనా లక్షణాలున్నా సరైన వైద్యం తీసుకోకపోవడంతో గ్రామీణులు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. మండల కేంద్రాలు, గ్రామాల్లోనూ మరణాలు భారీగా నమోదవుతున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. ముప్పు తప్పింది
రాకెట్ శకలాలు ధ్వంసమైన తర్వాత మిగిలిన భాగాలు.. హిందూ సముద్రంలో పడినట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతం మాల్దీవులకు సమీపంలో హాంకాంగ్‌కు చెందిన సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ వార్తా సంస్థ స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. ఇలా చేయొద్దు...
కరోనా వైరస్ సోకినప్పటికీ వైద్యుల సూచనలతో ఇంట్లోనే కోలుకోవచ్చు. వైరస్ నుంచి బయటపడాలనే ఆత్రుతతో కొందరు సొంత వైద్యం పాటిస్తున్నారు. అయితే.. సొంతంగా యాంటీబయాటిక్, స్టెరాయిడ్లు వాడటం మరింత ముప్పుగా మారుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. లొంగిపోండి
మావోయిస్టు అగ్రనేతలు కరోనా బారిన పడినట్లు సమాచారం అందిందని తెలిపారు దంతెవాడ ఎస్పీ అభిషేక్ పల్లవ్. కొవిడ్ బాధిత మావోయిస్టులు లొంగిపోతే ఉచితంగా తగిన వైద్య సాయం అందిస్తామని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6. వేతనాల వెత
2016లో గ్రూప్-2లో ఎంపికైన 257 మంది డిప్యూటీ తహసీల్దార్ల(డీటీల)కు ప్రభుత్వం గత నెలలో పోస్టింగులు ఇచ్చింది. మూణ్నెళ్లుగా వీరికి వేతనాలు అందించడం లేదు. వీరిలో కరోనా బారిన పడిన 60 మంది చికిత్స, మందుల కొనుగోళ్ల కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7. 'అమ్మ'కు సైకత సలాం!
అంతర్జాతీయ మాతృ దినోత్సవాన్ని పురస్కరించుని ప్రముఖ సైకత కళాకారుడు సుదర్శన్ పట్నాయక్ వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం ఒడిశాలోని పూరీ తీరంలో ఆయన సైకత శిల్పం తయారు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8.చెక్ బౌన్స్ అయితే శిక్షలు ఏంటి?
రుణాలకు సంబంధించిన విషయంలో చాలా సార్లు మనం చెక్ బౌన్స్ అనే మాట వింటుంటాం. దీనితో పాటు ఈసీఎస్ ఫెయిల్ అయిందని కూడా చెబుతుంటారు చాలా మంది. ఇంతకీ ఏమిటి ఈ చెక్‌బౌన్స్, ఈసీఎస్? వీటితో రుణగ్రహితలకు వచ్చే చిక్కులు ఏమిటి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9. మా ఇద్దరి మధ్య అదేం లేదే..
మాల్దీవుల్లోని ఓ బార్లో తమ ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు వస్తున్న వార్తలను ఖండించారు ఆసీస్ క్రికెటర్ డేవిడ్ వార్నర్, వ్యాఖ్యత మైకేల్ స్లేటర్. అదంతా నిజం కాదని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10. సారా సాయం
కరోనా సంక్షోభంలో దేశవ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న నటుడు సోనూసూద్‌కు పలువురు మద్దతుగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ హీరోయిన్ సారా అలీఖాన్ తన వంతు సాయంగా సోనూసూద్ ఫౌండేషన్‌కు విరాళాన్ని ప్రకటించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.