1.మళ్లీ టీకాలు
నేటి నుంచి రాష్ట్రంలో యాథావిధిగా టీకాల పంపిణీ కొనసాగనుంది. రాష్ట్రంలో 45 ఏళ్లు పైబడిన వారికి యథావిధిగా టీకాల పంపిణీ చేయనున్నారు. నిన్న రాష్ట్రానికి 4 లక్షల కొవిషీల్డ్ టీకా డోసులు చేరుకున్నాయి. 4 లక్షల డోసులను అన్ని జిల్లాలకు అధికారులు తరలించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. తిరుగులేని తెరాస
మినీ పురపోరులో తెరాసకు ఘన విజయాన్ని అదించిన ప్రజలకు పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ధన్యవాదాలు తెలిపారు. వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు సిద్ధిపేట, నకిరేకల్, అచ్చంపేట, జడ్చర్ల, కొత్తూరు మున్సిపాల్టీల్లో 74 శాతం వార్డుల్లో గెలిపించినందుకు ధన్యవాదాలు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. వేగంగా విచారణ
దేవరయాంజాల్‌లోని భూముల ఆక్రమణ ఆరోపణలపై ఐఏఎస్‌ల కమిటీ రంగంలోకి దిగింది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ నిర్మించిన గోదాములను పరిశీలించింది. ఈ ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. 2 కోట్ల టీకా డోసులు కావాలి
భారత్‌లో వ్యాక్సిన్ల కొరతపై డబ్ల్యూహెచ్ఓ కీలక ప్రకటన చేసింది. టీకా పంపిణీలో ఏర్పడ్డ అవాంతరాలను పూడ్చేందుకు 'కొవాక్స్' కార్యక్రమానికి.. 2 కోట్ల టీకాలు అవసరమని పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. జాతీయ ప్రత్యామ్నాయ నేత దీదీయేనా?
జాతీయ స్థాయిలో భాజపాకు ప్రత్యామ్నాయంగా ఉన్న కాంగ్రెస్ పరిస్థితి దయనీయంగా మారిపోతోంది. ఈ సమయంలోనే బంగాల్లో అనూహ్య విజయం సాధించిన టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ.. జాతీయ స్థాయి నేతగా మారే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6. 'లాక్‌డౌన్'- కొవిడ్‌ను దిగ్బంధించే వ్యూహం!
గత వారం రోజుల్లోనే ఎకాయెకి 26 లక్షల కొత్త కేసులు, 23,800 మరణాలతో యావద్దేశం కుమిలిపోతోంది. ఈ నేపథ్యంలో కొవిడ్ కట్టడిని లక్షించి దేశవ్యాప్తంగా మళ్లీ పటిష్ఠ లాక్‌డౌన్ విధించాలన్న ప్రతిపాదనలు గట్టిగా వినవస్తున్నాయి. లాక్‌డౌన్ కారణంగా తలెత్తే సామాజిక ఆర్థిక దురవస్థలేమిటో తెలుసంటూ నిరుపేద వర్గాల ఆకలి దప్పుల్ని గుర్తించి ముందస్తు చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు కూడా నిర్దేశించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7. భారీ వాణిజ్య ఒప్పందం
భారత్- బ్రిటన్ మధ్య వాణిజ్య బంధం మరింత బలపడనుంది. భారత్‌తో జీబీపీ 1 బిలియన్ విలువ గల ఒప్పందాన్ని బ్రిటన్ ప్రకటించింది. మంగళవారం జరగనున్న బోరిస్- మోదీ సమావేశంలో దీనిపై నేతలు సంతకాలు చేయనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8. 'ఇక వద్దనుకున్నాం..'
వివాహ బంధానికి ముగింపు పలుకుతున్నట్లు బిల్‌గేట్స్, ఆయన భార్య మిలిందా గేట్స్ ప్రకటన చేశారు. దంపతులుగా తాము ఇక కొనసాగలేమని భావిస్తున్నట్లు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9. ఐపీఎల్ సాగేనా..!
అత్యంత సురక్షితమని భావించిన ఐపీఎల్ బయో బబుల్‌లోనూ కరోనా అడుగుపెట్టింది. కోల్‌కతా ఆటగాళ్లతో పాటు చెన్నై బృందంలోనూ కొవిడ్ కేసులు బయటపడ్డాయి. మహమ్మారి గుబులు రేపుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో లీగ్ సురక్షితంగా కొనసాగేనా? ఈ ఏడాది చివర్లో జరగనున్న టీ20 ప్రపంచకప్ వేదికను భారత్ నుంచి తరలించనున్నారా! పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10. 'వకీల్‌సాబ్' చిత్రంపై ఫిర్యాదు!
పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ నటించిన 'వకీల్‌సాబ్' చిత్రంపై ఓ వ్యక్తి ఫిర్యాదు చేశారు. సినిమాలో హీరోయిన్ అంజలి ఫొటోతో పాటు తన చరవాణి నంబరు జత చేయడం వల్ల గుర్తు తెలియని వ్యక్తులు కాల్ చేసి వేధిస్తున్నారని పోలీసులను ఆశ్రయించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.