1. వైరస్ విస్తరణ
తెలంగాణలో కరోనా రెండో దశ వ్యాప్తి మరింతగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 1,321 మందికి పాజిటివ్‌గా తేలింది. ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 3,12,140కి చేరింది. ప్రస్తుతం 7,923 యాక్టివ్ కేసులు ఉన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. కరోనా పంజా
దేశంలో కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. శనివారం ఒక్కరోజే 93,249 మందికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. వైరస్ సోకినవారిలో మరో 513 మంది ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. ఈస్టర్ సందర్భంగా ప్రముఖుల శుభాకాంక్షలు
ఈస్టర్ పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు.. ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు. క్షమ, త్యాగానికి ఏసుక్రీస్తు ప్రతిరూపమని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కొనియాడారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. టీపాయ్ సుందరీ..!
అందమైన అమ్మాయే నట్టింట్లో ఒద్దికగా కూర్చుని టీ అందిస్తుంటే ఇంటికొచ్చిన అతిథులెవరికైనా ఆనందంగానే కాదు.. ఆశ్చర్యంగానూ అనిపిస్తుంది కదూ. అందుకే ఈ మధ్య లివింగ్‌రూములో అలంకరించే సెంటర్ టేబుళ్లూ లేదా కాఫీ టేబుళ్లను అమ్మాయి బొమ్మలతో అలంకరించేస్తున్నారు సౌందర్యోపాసకులు!. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. 15 మంది జవాన్లు మిస్సింగ్!
ఛత్తీస్‌గఢ్ బీజాపుర్ జిల్లా అడవుల్లో నక్సల్స్‌కు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఎన్కౌంటర్ తర్వాత... 15 మంది భద్రతా సిబ్బంది అదృశ్యమయ్యారని తెలుస్తోంది. ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు అమరులు కాగా.. ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయని పోలీసులు చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6. ఎన్నికల నుంచి తప్పుకున్న ట్రాన్స్‌జెండర్
కేరళ ఎన్నికల్లో డెమొక్రటిక్ సోషల్ జస్టిస్ పార్టీ నుంచి బరిలో నిలిచిన ట్రాన్స్‌జెండర్ అనన్య కుమారి అలెక్స్ పోటీ నుంచి తప్పుకున్నారు. పార్టీలో తాను లైంగిక వేధింపుల్ని, తీవ్ర వివక్ష ఎదుర్కొంటున్నట్లు ఆరోపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7. ట్రక్కు- బస్సు ఢీ
చైనా జియాంగ్సు రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కు, బస్సు ఢీకొన్న ఘటనలో 11 మంది మరణించారు. మరికొందరు గాయపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8. సరికొత్త ఛాలెంజ్
'కాల్ ఆఫ్ డ్యూటీ మొబైల్ ఏసెస్ ఇస్పోర్ట్స్ ఛాలెంజ్' పేరుతో సరికొత్త ఆన్లైన్ షూటింగ్ గేమ్ పోటీని జియోగేమ్స్ ఇస్పోర్ట్స్ ప్లాట్‌ఫామ్‌పై క్వాల్కామ్ నిర్వహించనుంది. రూ. 25 లక్షల ప్రైజ్‌పూల్‌తో తొలి ఇ-కాంటెస్ట్‌కు రిజిస్ట్రేషన్లు కూడా ప్రారంభమయ్యాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9. 'అందుకే బూమ్రాను చేసుకున్నా..'
క్రికెటర్ బుమ్రాను వివాహం చేసుకోవడానికి గల కారణాన్ని వెల్లడించింది సంజనా గణేశన్. ఇంతకీ ఆమె చెప్పింది? వీరి పెళ్లి గతనెల 15న గోవాలో జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10.అక్షయ్ కుమార్‌కు కరోనా
ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్‌కు కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.