ETV Bharat / state

టాప్​టెన్​ న్యూస్​ @9AM - top ten news till now

ఇప్పటివరకు ఉన్న ప్రధానవార్తలు

టాప్​టెన్​ న్యూస్​ @9AM
టాప్​టెన్​ న్యూస్​, 9AM
author img

By

Published : Apr 4, 2021, 9:00 AM IST

1. కట్టడి చర్యలు

ట్రేసింగ్​.. టెస్టింగ్​.. ట్రీటింగ్​ విధానంలో కరోనా కట్టడికి వైద్యారోగ్య శాఖ కొత్త యాప్​ను రూపొందించిందని ఆ శాఖ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. పీహెచ్​సీ స్థాయి వరకు రాపిడ్ యాంటీజెన్​ పరీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో పాజిటివ్ వచ్చిన వ్యక్తుల.. కాంటాక్ట్​లకు వెంటనే సమాచారం పంపేలా యాప్​ను రూపొందించినట్లు చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. కొత్తగా నమోదు వద్దు

కొవిడ్ 19 వ్యాక్సినేషన్ కోసం ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్​లైన్​ వర్కర్ల నూతన రిజిష్ట్రేషన్లకు అనుమతి ఇవ్వొద్దని రాష్ట్రాలకు కేంద్రం స్పష్టంచేసింది. ఈ కేటగిరీలో నిబంధనలకు విరుద్ధంగా అనర్హులు టీకాలు పొందుతున్నట్లు గుర్తించిన నేపథ్యంలో ఈ మేరకు ఆదేశించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3.కదులుతున్న డొంక

సంచలనం సృష్టించిన కర్ణాటక మత్తుమందుల కేసు.. తెలంగాణలోనూ కలకలం రేపుతోంది. రాష్ట్రానికి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేల ప్రమేయంపై ఆరోపణలు వస్తుండడం.. వీరికి సినీ ప్రముఖులతో సంబంధాల ఉండడంపై కర్ణాటక పోలీసులు.. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4.అలైన్‌మెంట్‌లో మార్పులు!

ప్రాంతీయ రింగు రోడ్డు అమరికలో మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఆరు జిల్లాల నుంచి ఈ మార్గం వెళ్లనుంది. గడిచిన కొన్నేళ్లలో పలు ప్రాంతాల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రాంతీయ రింగు రోడ్డు అలైన్‌మెంట్‌కు అడ్డంకిగా మారుతున్నట్లు అధికారులు తాజాగా గుర్తించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. మేలో ఎన్నికలు

శాసనమండలిలో ఏడు ఎమ్మెల్సీ స్థానాలు జూన్‌లో ఖాళీ కానున్నాయి. ఎమ్మెల్యేల ద్వారా ఎంపికైన ఆరుగురు ఎమ్మెల్సీలు, గవర్నర్‌ నామినేటెడ్‌ కోటాలో ఎంపికైన మరో ఎమ్మెల్సీ పదవీ విరమణ చేయనున్నారు. ఇందులో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు వచ్చే నెలలో ఎన్నికలు జరగనున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. మాతృభాష కోసం...

తెలుగు భాషకు ఉన్న ప్రాచీన హోదాను కాపాడుకునేందుకు భాషాభిమానులు నడుం కట్టాల్సిన అవసరం ఉంది. గడచిన మూడేళ్లలో సంస్కృత, తమిళ భాషలకు కేంద్రం రూ.25 కోట్లు కేటాయించగా, తెలుగు కేంద్రానికి మూడు కోట్ల రూపాయలు మంజూరు చేసింది. దీనికి కారణం తెలుగు భాషా కేంద్రానికి స్వతంత్ర ప్రతిపత్తి లేకపోవడమే. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7.కాలు కదిపిన దీదీ

బంగాల్ సీఎం మమతా బెనర్జీ.. వీల్​ ఛైర్​లో కూర్చొని గాయపడిన కాలును ముందుకూ వెనక్కూ ఊపారు. దాదాపు 30 సెకండ్లు ఉన్న ఈ వీడియో వైరల్​గా మారింది. భాజపా అధికార ప్రతినిధి ప్రణయ్​ రాయ్​ ఫేస్​బుక్​ ద్వారా ఈ వీడియోను షేర్​ చేశారు. దీదీపై విమర్శలు గుప్పించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8.అంగట్లో సమాచారం..

ఆన్​లైన్​లో 500 మిలియన్ల ఫేస్​బుక్​ ఖాతాదారుల వివరాలు లభ్యమయ్యాయి. ఈ సమాచారం 2019 నాటిదే అయినప్పటికీ.. సామాజిక మాధ్యమాల్లో వినియోగదారుల భద్రతకు సంబంధించి ప్రశ్నలు లేవనెత్తుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. కొవిడ్​ కలవరం

ఇంకో ఐదు రోజుల్లో ఐపీఎల్‌ 14వ సీజన్‌ ఆరంభం కావాల్సి ఉంది. ఈ సమయంలో లీగ్‌లో భాగమైన దాదాపు 20 మంది కరోనా బారిన పడటం కలకలం రేపుతోంది. దిల్లీ క్యాపిటల్స్‌ స్పిన్నర్‌ అక్షర్‌ పటేల్‌కు శనివారం కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. డార్లింగ్​ కొత్త చిత్రం

'ఖైదీ', 'మాస్టర్​' వంటి విజయవంతమైన చిత్రాలతో దూసుకెళ్తున్న దర్శకుడు లోకేష్ కనగరాజ్​.. ప్రభాస్​తో సినిమా చేయనున్నారా? అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. ఇప్పటికే కథ కూడా సిద్ధమైనట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.