ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురు
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ తొలగింపు వ్యవహారంపై ఏపీ హైకోర్టు తీర్పు వెలువరించింది. ఎస్‌ఈసీ విషయంలో నిబంధనలు మారుస్తూ తెచ్చిన ఆర్డినెన్స్‌ను ఏపీ న్యాయస్థానం కొట్టివేసింది. ఇంకేమన్నదంటే...
మళ్లీ పదవిలోకి వచ్చి
ఏపీ హైకోర్టు తీర్పుపై నిమ్మగడ్డ రమేష్‌కుమార్ స్పందించారు. గతంలో మాదిరిగా నిష్పక్షపాతంగా పనిచేస్తానని తెలిపారు. ఇంకేమన్నారంటే...
గోదారి నీళ్లతో కొండపోచమ్మ
సిద్దిపేట జిల్లాలోని మర్కూక్ పంప్‌హౌస్ నుంచి కొండపోచమ్మ జలాశయానికి సీఎం కేసీఆర్ నీటిని విడుదల చేశారు. మర్కూక్ పంప్‌హౌస్‌ను ప్రారంభించిన అనంతరం చినజీయర్ స్వామితో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. మరిన్ని వివరాలు..
ప్రాణం తీసిన కొత్త సెల్‌ఫోన్
అప్పటి వరకు మంచిగానే ఉన్న భార్యాభర్తల మధ్య ఫోన్ చిచ్చు పెట్టింది. మనస్తాపం చెందిన భార్య ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇంతకీ ఆ ఫోన్ వెనుక రహస్యమేంటి?
రాజ్యసభలో కరోనా!
రాజ్యసభ సచివాలయానికి చెందిన ఓ అధికారికి కరోనా పాజిటివ్‌గా తేలింది. మే 28న విధులకు హాజరైన డైరెక్టర్ స్థాయి అధికారి సహా ఆయన కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. ఇది తెలిసిన అధికారులు ఏం చేశారంటే...
ముంబయిలో మెగా ల్యాబ్
కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా ముంబయిలోని మొత్తం జనాభాకు పరీక్షలు నిర్వహించేలా మెగా ల్యాబ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఐఐటీ పూర్వ విద్యార్థుల సమాఖ్య ప్రకటించింది. ఇప్పటికే పనులు ప్రారంభించినట్లు తెలిపింది. దీని సామర్థ్యం ఎంతంటే...
అమెరికాలో పోలీసుల కాల్పులు
అమెరికాలో ఓ అంశమై నిరసన చేపడుతున్న వారిని చెదరగొట్టేందుకు పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఏడుగురికి గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఆ నిరసనలు ఎందుకు?
వైద్యులను చంపేసిన ఉగ్రవాదులు
సోమాలియాలో తొమ్మిది మంది వైద్యులను అపహరించి, దారుణంగా చంపేశారు ఉగ్రవాదులు. దేశంలోని బలాద్ నగరంలో వైద్యుల మృతదేహాలు లభ్యం కావడం సంచలనం రేపింది. మరిన్ని వివరాలకై క్లిక్ చేయండి.
మాజీ క్రికెటర్ ఇంట్లో కారు చోరీ
మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఇంట్లో కారునే ఎత్తుకెళ్లాడు ఓ దొంగ. అతడి తండ్రి ఉపయోగిస్తున్న ఆ వాహనం చోరీకి గురైందని శుక్రవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదు చేశారు. తరువాత ఏమి జరిగి ఉంటుంది?
'లక్ష్మీబాంబ్' ఓటీటీ హక్కులు
'లక్ష్మీబాంబ్' ఓటీటీ హక్కుల్ని దాదాపు రూ.125 కోట్ల మొత్తానికి హాట్‌స్టార్ కొనుగోలు చేసిందనే వార్త ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై చిత్రయూనిట్ ఏమన్నదంటే...