భారీ లాభాల్లో మార్కెట్లు..
అంతర్జాతీయ సానుకూలతలకు తోడు దేశీయంగా లాక్డౌన్ సడలింపులు ఇవ్వడం, పారిశ్రామిక వర్గాలకు చేయూతనిస్తామని ప్రధాని మోదీ హామీ ఇవ్వడం వల్ల.. స్టాక్ మార్కెట్లలో లాభాల పరంపర కొనసాగుతోంది. నిఫ్టీ పుంజుకుని ఎంత వద్ద ట్రేడ్ అవుతుందంటే..
'నిసర్గ' తీవ్రరూపం..
తూర్పు-మధ్య అరేబియా సముద్రంలో కేంద్రీకృతమైన నిసర్గ తుపాను మరింత తీవ్ర రూపం దాల్చుతోంది. మహారాష్ట్రలో 85-95 కిలోమీటర్ల నుంచి 90-100 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటోంది?
కేంద్ర మంత్రివర్గ భేటీ
కేంద్ర మంత్రివర్గం నేడు భేటీ కానుంది. ప్రధానమంత్రి అధికారిక నివాసంలో ఈ సమావేశం జరగనుంది. మూడు రోజుల వ్యవధిలో ఇది రెండో మంత్రివర్గ సమావేశం. కీలక అంశాలపై నిర్ణయం తీసుకోనుందా?
పెద్దలూ జాగ్రత్త..!
కరోనా మహమ్మారి ప్రభావం వృద్ధులపై అధికంగా కనిపిస్తోంది. వైరస్ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని వృద్ధులను, పదేళ్లలోపు చిన్నారులను ఇళ్లకే పరిమితం చేయాలని, దీర్ఘకాల సమస్యలతో బాధపడుతున్న వారిని మరీ జాగ్రత్తగా చూసుకోవాలని సూచిస్తున్నారు. ఇంకేమన్నారంటే...
నీకు ఎవరూ సాటి రారమ్మా...
అమ్మా.... నేనూ స్కూల్కు వెళ్తున్నా.. ఈసారి పరీక్షల్లో ఫస్ట్ వస్తా.. ఇలాంటి మాటాలు పిల్లలు చెబుతుంటే... తల్లిదండ్రులకు కలిగే సంతోషం వెలకట్టలేనిది. అలా కాకుండా.. కన్న బిడ్డకు ఆరోగ్య సమస్య.. ఉండి కనీసం నడవలేని స్థితిలో ఉంటే.. సపర్యలు చేయడం కష్టమే. కానీ ఓ తల్లి మాత్రం వైకల్యంతో పుట్టిన కొడుకును 14 ఏళ్లుగా.. కంటికి రెప్పలా చూసుకుంటోంది. దాతల సాయం కోసం వేచి చూస్తుంది..
సింగరేణిలో ప్రాణాలకు విలువేది?
సింగరేణిలో పనిచేసే పొరుగుసేవల ఉద్యోగి చనిపోతే పరిహారం అరకొరగానే అందుతోంది. గుత్తేదారులు తమ దయాదాక్షిణ్యాల ఆధారంగా ప్రాణానికి విలువ కట్టి బేరమాడి పరిహారం ఇస్తున్నారు. శాశ్వత ఉద్యోగులతో సమానంగా పరిహారం ఇవ్వాలని కార్మికసంఘాలు డిమాండ్లు పట్టించుకునేది ఎవరు?
త్వరలోనే కేబుల్ బ్రిడ్జి
184 కోట్ల వ్యయంతో దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయి. 754.38 మీటర్ల పొడవు గల బ్రిడ్జి త్వరలోనే అందుబాటులోకి రానుంది. మరిన్ని వివరాలు...
అప్పుడే తిరుమలేశుని దర్శనం!
శ్రీవారి దర్శనం కోసం భక్తుల ఎదురుచూపులు ఫలించాయి. జూన్ 8 నుంచి మూడు రోజులపాటు తితిదే ఉద్యోగులతోపాటు తిరుమల స్థానికులకు ప్రయోగాత్మక దర్శనం కల్పించి.. వాటికి అనుగుణంగా తుది నిర్ణయం తీసుకోనున్నారు.
సామాన్యుని రథం
సైకిల్... సామాన్యుల ప్రయాణంలో కీలక పాత్రధారి. ఒక సాధారణ, చౌకైన, సులభతర ప్రయాణ వాహనం. మొత్తంగా బహుళ ప్రయోజనకారి. పురాతన కాలంలో పనులను వేగవంతం, సులభతరం చేయడంలో దీని పాత్ర అమోఘం. ఇవాళ ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా సైకిల్ విశేషాలు మీకోసం...
సిక్కోలు టూ సిడ్నీ
బాక్సింగ్ క్వీన్ మేరికోమ్ బయోపిక్ హిట్. కుస్తీరాణి గీతా ఫోగట్ ఫ్యామిలీ బయోపిక్ సూపర్ హిట్. ఇప్పుడొస్తోంది.. తెలుగమ్మాయి బయోపిక్! అలవికాని బరువులను అవలీలగా ఎత్తిన అతివ కథ. ఒలింపిక్స్ పతక విజేత, పద్మశ్రీ పురస్కార గ్రహీత, రాజీవ్ ఖేల్‌రత్న మన కరణం మల్లీశ్వరి కథ.. వెండితెరకెక్కుతోంది. దీనిపై ఆమె ఏమంటుందంటే..