ETV Bharat / state

టాప్​టెన్​ న్యూస్​ @ 10AM - ఇప్పటి వరకు ప్రధాన వార్తలు

ఇప్పటివరకు ప్రధాన వార్తలు

top-ten-news
టాప్​టెన్​ న్యూస్​ @ 10AM
author img

By

Published : May 29, 2020, 9:57 AM IST

పూర్ణాహుతిలో పాల్గొన్న కేసీఆర్

కాళేశ్వరగంగను ఒడిసిపట్టేందుకు కొండపోచమ్మ సాగరం ముస్తాబైంది. మరికాసేపట్లో కేసీఆర్ ఈ ప్రాజెక్టును ప్రారంభించనున్న నేపథ్యంలో... ముందుగా కొండపోచమ్మ ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. మరిన్ని వివరాలు..

మరోసారి చిరుత సంచారం

రాజేంద్రనగర్​ పరిధిలో మరోసారి చిరుత కలకలం రేగింది. పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఒంటరిగా బయటకి రావద్దంటూ హెచ్చరిస్తున్నారు. ఇంతకీ వారు చిరుతను ఎక్కడ చూశారు?

రాష్ట్రంలో కొవిడ్‌ ఉద్ధృతి

రాష్ట్రంలో గురువారం మరో 117 కరోనా వైరస్‌ కేసులు నమోదయ్యాయి. మరో నలుగురు కరోనాకు బలైనట్టు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. ఇప్పటివరకు ఎన్నికేసులు నమోదయ్యాయంటే...

ఎస్‌ఈసీ ‘ఆర్డినెన్స్‌’పై హైకోర్టు తీర్పు

ఆంధ్రప్రదేశ్​ మెుత్తం ఉత్కంఠతో ఎదురు చూస్తున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌(ఎస్ఈసీ) వ్యవహారంపై తీర్పును శుక్రవారం హైకోర్టు వెల్లడించనుంది.

ఒక్కరోజులో కొవిడ్ 7466 కేసులు

దేశంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 7466 కొత్త‬ కేసులు నమోదయ్యాయి. మరో 175మంది ప్రాణాలు కోల్పోయారు. మరిన్ని వివరాలు..

మహారాష్ట్రలో మరణ మృదంగం

దేశంలో కరోనా మహమ్మారి మరణ మృదంగం మోగిస్తోంది. గడిచిన 24 గంటల్లో మొత్తం 15 రాష్ట్రాల్లో 194 మంది మరణించగా.. ఒక్క మహారాష్ట్రలోనే 105 మంది ప్రాణాలు కోల్పోవటం ఆందోళన కలిగిస్తోంది.

'మోదీ సంతృప్తిగా లేరు'

భారత్​, చైనా సరిహద్దు అంశమై నెలకొన్న ఉద్రిక్తతలను రూపుమాపే దిశగా మధ్యవర్తిత్వం వహిస్తానని మరోసారి ప్రకటించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. చైనాతో సరిహద్దు అంశమై ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంతృప్తిగా లేరని వ్యాఖ్యానించారు. ఆయన ఎందుకు అలా అన్నారంటే...

వాహనాల పరుగులెప్పుడు?

కరోనాతో కుదేలైన ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు కేంద్రం రూ.20 లక్షల కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించింది. దీని నుంచి వాహన రంగం భారీ ప్రోత్సాహం ఆశించగా.. ఆటో రంగానికి నిరాశే మిగిలింది. వాహన రంగానికి కావాల్సిన ప్రోత్సాహకాలపై నిపుణులు ఏమంటున్నారంటే..

ఐపీఎల్​పై ఆశలు..

ఆస్ట్రేలియాలో టీమిండియా పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూల్​ను విడుదల చేసింది ఆసీస్​ బోర్డు. ఇందులో రెండు నెలల సమయం ఖాళీగా ఉంచడం ఐపీఎల్​ నిర్వహణపై ఆసక్తి రేకెత్తిస్తోంది. ఎందుకలా ఖాళీగా ఉంచింది?

రష్మిక ఎమోషనల్​ పోస్ట్

లాక్​డౌన్​తో ఇంట్లోనే ఉన్న కథానాయిక రష్మిక.. భావోద్వేగభరిత సందేశాన్ని ఇన్​స్టాలో రాసుకొచ్చింది. తన జీవితంలోని మారథాన్ రేస్​​లో ఫినిషింగ్ లైన్​ దగ్గరకు చేరుకున్నట్లు అనిపిస్తోందని తెలిపింది. ఇంకేమందంటే...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.