ETV Bharat / state

టాప్​టెన్​ న్యూస్ @7AM - న్యూస్​ టుడే

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Telangana News
టాప్​టెన్​ న్యూస్
author img

By

Published : Feb 15, 2022, 6:58 AM IST

  • ముగిసిన సహస్రాబ్ది ఉత్సవాలు

భగవత్ రామానుజాచార్యుల వెయ్యేళ్ల పండుగ వైభవంగా ముగిసింది. 12 రోజుల పాటు శోభాయమానంగా జరిగిన సహస్రాబ్ది వేడుకల్లో 216 అడుగుల సమతామూర్తి విగ్రహంతో పాటు బంగారు ప్రతిమను లోకార్పణం చేశారు. 108 ఆలయాల్లో దేవతామూర్తులకు ప్రాణప్రతిష్ఠ చేసి నిత్యారాధనకు సిద్ధం చేశారు. దేశ నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి సమతామూర్తిని దర్శించుకున్నారు.

  • రేపటి నుంచే మేడారం మహా జాతర

Medaram maha jathara 2022: రేపటి నుంచి ప్రారంభమయ్యే మేడారం మహా జాతరకు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే యాభై లక్షల పైగా భక్తులు ముందస్తు మొక్కులు చెల్లించుకోగా.. ఈ నాలుగు రోజులు మరో 80 లక్షల మంది దర్శనాలు చేసుకుంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా సర్కార్.. రూ.75 కోట్లు వెచ్చించి పనులు చేపట్టింది.

  • 'ఆపరేషన్ దిల్లీ' వేగవంతం

దేశ రాజకీయాలు ఆసక్తికరమైన మలుపు ముందు ఉన్నాయి. భాజపాను ఎదురించే దిశగా ప్రాంతీయ శక్తులు ఏకమవుతున్నాయి. జాతీయ స్థాయిలో కార్యాచరణకు వేగంగా అడుగులు పడుతున్నాయి. వ్యూహాత్మక పనులన్నీ తెరవెనుక చకచకా జరిగిపోతున్నాయి. త్వరలో దిల్లీలో విపక్ష సీఎంలు భేటీ కానుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.

  • కార్బెవాక్స్​ అత్యవసర వినియోగానికి సిఫార్సు

Corbevax Vaccine: పన్నెండు నుంచి పద్దెనిమిదేళ్ల వయసు పిల్లలకు కార్బెవాక్స్ టీకా అత్యవసర వినియోగానికి డీసీజీఐకు నిపుణులు సిఫార్సు చేసినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ టీకా ధర రూ.145 ఉండొచ్చని పేర్కొన్నాయి.

  • పంజాబ్​ ప్రజలకు రాహుల్ విజ్ఞప్తి

ఎన్నికల్లో ప్రయోగాలు చేయవద్దని పంజాబ్​ ప్రజలకు విజ్ఞప్తి చేశారు కాంగ్రెస్​ నేత రాహుల్ గాంధీ. పంజాబ్​పై పూర్తి అవగాహన ఉన్న కాంగ్రెస్​ మాత్రమే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలదని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ మళ్లీ అధికారంలోకి వస్తే డ్రగ్స్‌ సమస్యను అంతం చేస్తుందన్నారు.

  • రైతు దినోత్సవం'గా కేసీఆర్​ బర్త్​డే'

MLC PALLA ON KCR BIRTHDAY: సీఎం కేసీఆర్​ పుట్టినరోజైన ఫిబ్రవరి 17ను తెలంగాణ రైతు దినోత్సవంగా నిర్వహించాలని రైతుబంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్​రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా వేడుకలను ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు.

  • ఉక్రెయిన్​ అధ్యక్షుడి ప్రకటన!

రష్యా తమ దేశం మీద మరికొన్ని గంటల్లో దాడికి దిగుతుందని ప్రకటించారు ఆ దేశ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్​ స్కీ. సరిహద్దులో భారీ ఎత్తున రష్యన్​ బలగాలు మోహరించిన నేపథ్యంలో అధ్యక్షుడి చేసిన వ్యాఖ్యలు స్థానికుల్లో మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. మరోవైపు ఉక్రెయిన్​ రాజధానిలోని అమెరికా రాయబారా కార్యాలయాన్ని వేరే ప్రాంతానికి తరలిస్తున్నట్లు ప్రకటించారు ఆ దేశ విదేశాంగ మంత్రి బ్లింకన్.

  • ఎయిర్​ ఇండియా కొత్త సీఈఓగా ఇల్కర్‌

Air India CEO: టాటాసన్స్​ ఎయిర్​ ఇండియా కొత్త సీఈఓను నియమించింది. గతంలో టర్కిష్‌ ఎయిర్‌లైన్స్‌కు ఛైర్మన్​గా సేవలందించిన ఇల్కర్​ ఐసీకి ఈ సీఈఓ, ఎండీ బాధ్యతలను అప్పగించింది. ఎయిర్​ ఇండియాను నవ శకం దిశగా నడిపించేందుకు టాటా గ్రూపులోకి ఇల్కర్‌ను ఆహ్వానించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు టాటా సన్స్​ ఛైర్మన్​ చంద్రశేఖరన్.

  • ఈ మూడు జట్లకు కెప్టెన్లు వీరేనా..?

గత కొన్ని రోజుల నుంచి అభిమానుల్లో ఆసక్తిరేపిన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్ (ఐపీఎల్‌) మెగా వేలం రెండు రోజులపాటు కోలాహలంగా జరిగింది. మొత్తం పది ఫ్రాంచైజీలు దాదాపు రూ. 550 కోట్లకుపైగా ఖర్చు చేసి 204 మంది ఆటగాళ్లను దక్కించుకున్నాయి. ఇప్పటికే ఏడు జట్లు తమ సారథులను ఎంపిక చేసుకోగా.. ఇంకో మూడు ఫ్రాంచైజీలు మాత్రమే కెప్టెన్‌ ఎవరనేది ప్రకటించాల్సి ఉంది.

  • ఆర్​సీ-15 సినిమాలో కోలీవుడ్​ స్టార్​!

Ramcharan Shankar movie: రామ్​చరణ-శంకర్​ కాంబోలో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న సినిమాలో తమిళ స్టార్​ ఎస్​ జే సూర్య నటించనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికార ప్రకటన వచ్చే అవకాశముంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.