ETV Bharat / state

టాప్​టెన్ న్యూస్ @7AM - top news

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

7AM
టాప్​టెన్ న్యూస్ @7AM
author img

By

Published : Feb 14, 2022, 6:59 AM IST

  • పీఎస్‌ఎల్‌వీ- సీ52 విజయవంతం

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌-సి52 ప్రయోగం విజయవంతమైంది. శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ అంతరిక్ష ప్రయోగం కేంద్రం నుంచి ఈ ప్రయోగాన్ని చేపట్టారు.

  • జనం కోరితే జాతీయ పార్టీ పెడతా

దేశాన్ని ఆగం పట్టిస్తున్న మోదీ ప్రభుత్వాన్ని తరిమితరిమి కొట్టే సమయం ఆసన్నమైందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. అన్ని రాజకీయశక్తులూ ఏకమై భాజపాను వెళ్లగొట్టాలని.. ప్రజలంతా కలిసి వస్తే.. నాయకుల పీఠాలు కదిలే పరిస్థితి వస్తుందన్నారు. దేశ ప్రజలంతా కోరితే.. తప్పకుండా జాతీయ పార్టీ పెడతానన్నారు. మోదీ పాలనలో దేశం సర్వనాశనం అయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • రెండో దశకు యూపీ సిద్ధం

ఉత్తర్​ప్రదేశ్​లో రెండో దశ ఎన్నికలు సోమవారం జరగనున్నాయి. ముస్లింలు, దళితులు, రైతులు ఈ దఫా ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనున్నారు. పోటీ ప్రధానంగా భాజపా, ఎస్పీ మధ్యే కనిపిస్తోంది. మరి ఈ సారి ఏ పార్టీని విజయం వరించనుంది? సానుకూలతలు, ప్రతికూలతలు ఏంటన్న విషయాలు పరిశీలిస్తే...

  • దేవభూమిలో ఎన్నికలకు సర్వం సిద్ధం

Uttarakhand Election 2022: ఉత్తరాఖండ్​ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. మొత్తం 70 స్థానాల్లో సోమవారం పోలింగ్ జరగనుంది. కొవిడ్-19 దృష్ట్యా ఎన్నికల సంఘం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంది.

  • ఎన్నికలకు సిద్ధమైన గోవా

Goa Election 2022: తీర ప్రాంతమైన గోవా ఎన్నికలకు సిద్ధమైంది. రాష్ట్రంలోని 40 స్థానాలకు సోమవారం పోలింగ్ జరగనుంది. ఇందుకోసం ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తిచేసింది.

  • ముగియనున్న సహస్రాబ్ది వేడుకలు

Sri Ramanuja sahasrabdi celebrations: రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లోని శ్రీరామనగరంలో ఏర్పాటు చేసిన సహస్రాబ్ది ఉత్సవాలు... నేటితో ముగియనున్నాయి. ఉత్సవాల్లో చివరి రోజైన ఇవాళ ఉదయం 9:30కి యాగశాలలో జరగనున్న సహస్ర కుండలాల యజ్ఞానికి మహాపూర్ణహుతి పలుకనున్నారు. ఆ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకానున్నట్లు తెలుస్తోంది.

  • గిరిజనుల మహా కుంభమేళా

కుంభమేళా తరువాత దేశంలో జరిగే అతి పెద్ద జాతర ఏదయినా ఉందంటే... అది మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరే. ప్రతి రెండేళ్లకోసారి మాఘమాసంలో నాలుగురోజులపాటు కన్నుల పండువగా జరిగే ఈ గిరిజనుల జాతరకు హాజరై... మొక్కులు చెల్లించుకుంటే సర్వ శుభాలూ కలుగుతాయని భక్తుల విశ్వాసం.

  • 5జీ దిశగా అడుగులు.. మే నెలలో వేలం!

5G Auction In India: దేశంలో 5జీ సేవలు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. 5జీ స్పెక్ట్రమ్‌ వేలం ప్రక్రియ నిర్వహణకు రంగం సిద్ధమవుతోంది. మే నెలలో ఈ ప్రక్రియ నిర్వహించే అవకాశం ఉందని టెలికాం విభాగానికి చెందిన ఓ సీనియర్‌ అధికారి వెల్లడించారు.

  • ఏ ఫ్రాంఛైజీ ఎవరిని కొనుగోలు చేసిందంటే?

IPL 2022 Mega auction: రెండు రోజులపాటు సాగిన ఐపీఎల్ మెగా వేలం ముగిసింది. పది ఫ్రాంచైజీలు కలిపి 204 మంది ఆటగాళ్లను వేలంలో దక్కించుకున్నాయి. ఇక రిటెయిన్ చేసుకున్నవారితో కలిపి ఒక్కో జట్టు వద్ద కనీసం 21 నుంచి గరిష్ఠంగా 25 మంది ఆటగాళ్లు ఉన్నారు. మరి ఏ జట్టు ఎవరిని ఎంత మొత్తానికి కొనుగోలు చేసుకుందో తెలుసుకుందాం..

  • ప్రతి ఒక్కరూ చదవాల్సిన ప్రేమపాఠం

పాఠశాలతో పాటు బాల్యానికి బైబై చెప్పి.. కాలేజ్​లోకి అడుగుపెట్టిన ప్రతి ఒక్కరిని టీనేజ్​ పలకరిస్తుంది. మనిషి ఎదుగుదలలో కీలకమైన ఈ టీనేజ్​లో శారీరక మార్పులతో పాటు మానసికంగాను పరిణితి వస్తుంటుంది. ఉరకలేసే వయసుకు తోడైన ఉడుకురక్తానికి ఏదైనా ఈజీనే అనిపిస్తుంటుంది. కనిపించే ప్రపంచమంతా.. అందంగా కనిపిస్తుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.