1.కరోనా విముక్తి కోసం..
ప్రధాని నరేంద్ర మోదీ బంగ్లాదేశ్‌లో రెండో రోజు పర్యటిస్తున్నారు. తెల్లవారుజామున చారిత్రక హిందూ దేవాలయాలను మోదీ సందర్శించి... ప్రత్యేక పూజలు నిర్వహించారు. కరోనా మహమ్మారి నుంచి యావత్ మానవజాతిని విముక్తం చేయాలని ప్రార్థించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. దిల్లీ ఎయిమ్స్‌కు రాష్ట్రపతి
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆరోగ్య పరిస్థితిపై దిల్లీలోని ఆర్మీ ఆస్పత్రి బులెటిన్ విడుదల చేసింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపింది. అయితే మరిన్ని పరీక్షల కోసం ఎయిమ్స్ ఆస్పత్రికి వెళ్లాలని సిఫార్సు చేస్తున్నట్లు వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. ఈ జాగ్రత్తలు మరవద్దు..
రంగుల పండగ హోలీ అంటే... చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరికీ ఎంతో ఇష్టం. ప్రస్తుత పరిస్థితుల్లో రంగులాటకు సిద్ధమయ్యే ముందు కొన్ని జాగ్రత్తలూ తీసుకోవాలి. అవేమిటంటే...పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. వలపు బాణమేసి...
‘‘మీ నగ్న వీడియోలు బాగున్నాయ్... స్నేహితులందరికీ పంపేద్దామా?.. లేక డబ్బులిస్తారా? అంటూ సైబర్ నేరస్థురాలు ఓ ఈవెంట్ మేనేజర్‌ను బెదిరించి రూ.10 లక్షలు కొల్లగొట్టింది. ఆపై డబ్బు డిమాండ్ చేస్తుండడంతో బాధితుడు శుక్రవారం సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. అది నేను కాదు
కర్ణాటక మాజీ మంత్రి రమేశ్ జర్కిహోళితో కలిసి అసభ్యకరమైన వీడియోలో ఉన్నట్లు భావిస్తున్న మహిళ.. తన కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరుతూ మరో వీడియో విడుదల చేశారు. అంతకు ముందు ఆ మహిళకు సంబంధించిన ఓ ఆడియో కాల్ వైరల్‌గా మారింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6. పోటాపోటీగా ఫిర్యాదులు
తొలి దశ పోలింగ్ నేపథ్యంలో బంగాల్ భాజపా, టీఎంసీ నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతున్నారంటూ ఎన్నికల సంఘానికి పోటాపోటీగా ఫిర్యాదులు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7. 'ప్రజాస్వామ్యాన్ని బలపరచండి'
ప్రజాస్వామ్యం బలోపేతం కోసం.. విభజన శక్తులకు వ్యతిరేకంగా భారీ సంఖ్యలో ఓటు హక్కును వినియోగించుకోవాలని అసోం, బంగాల్ ప్రజల్ని కోరారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. శనివారం అసోం, బంగాల్లో తొలిదశ పోలింగ్ నేపథ్యంలో రాహుల్ ఈ మేరకు పిలుపునిచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8. ఉత్తర కొరియాపై ఐరాస ఆంక్షలు!
ఇటీవల క్షిపణులను ప్రయోగించిన ఉత్తర కొరియాపై ఆంక్షల పునరుద్ధరణ చేయాలని తీర్మానించింది ఐక్యరాజ్య భద్రతా మండలి. విశ్వసనీయ, స్వతంత్ర దర్యాప్తు చేయాలని నిపుణులను ఆదేశించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9. రికార్డు మోత
ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో వన్డేలో ఓటమిపాలైంది టీమ్ఇండియా. 337 పరుగుల భారీ లక్ష్యాన్ని కాపాడుకోలేక చేతులెత్తేసింది. అయితే ఈ మ్యాచ్ ద్వారా పలు రికార్డులు నమోదయ్యాయి. అవేంటో చూద్దాం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10. పని పూర్తయింది
'వకీల్‌సాబ్' చిత్రానికి సంబంధించిన అప్డేట్ వచ్చేసింది. పవన్ పాత్రకు సంబంధించిన డబ్బింగ్ పూర్తయింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.