1.లంచ్ మోషన్ పిటిషన్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల ఎదురుకాల్పులపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. పౌరహక్కుల సంఘం వేసిన ఈ పిటిషన్‌పై మధ్యాహ్నం హైకోర్టు విచారణ చేపట్టనుంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
2.వ్యవసం.. వ్యాపారం..
ఉపాధి కోసం వచ్చి.. డ్రగ్స్ విక్రయిస్తున్న రాజస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. కరోనాతో ఉపాధి కోల్పోయి.. అప్పటికే ఓపీఎం డ్రగ్‌కు అలవాటు పడడంతో దాన్నే విక్రయించి డబ్బు సంపాదించాలని పథకం వేసినట్లు పోలీసులు గుర్తించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
3.చివరి రోజు
నర్సాపూర్ లంచం కేసులో నిందితుడు నగేశ్ కస్టడీ నేటితో ముగియనుంది. మూడు రోజులుగా నగేశ్‌ను ప్రశ్నించిన అధికారులు... పలు బినామీ ఆస్తులను గుర్తించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
4.హనుమంత వాహనంపై శ్రీవారు
తిరుమలలో శ్రీనివాసుడి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కన్నులపండువగా కొనసాగుతున్నాయి.ఈరోజు ఉదయం హనుమంత వాహనంపై దేవదేవుడు దర్శనమిచ్చారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
5.మోదీ కీలక వ్యాఖ్యలు
కరోనా అనంతర కాలంలో భారత్, శ్రీలంక మధ్య సహకారం మరింత పెరగాలని ప్రధాని నరేంద్రమోదీ ఆకాంక్షించారు. శ్రీలంక ప్రధాని మహీంద రాజపక్సతో భేటీకి ముందు ఈ వ్యాఖ్యలు చేశారు మోదీ. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
6.విజయవంతంగా పృథ్వీ-2 పరీక్ష
అణ్వాయుధాలను మోసుకెళ్లే సత్తా ఉన్న పృథ్వీ-2 క్షిపణి పరీక్షలను సైన్యం నిర్వహించింది. రాత్రి వేళ ఈ క్షిపణి ప్రయోగం నిర్వహించినట్లు డీఆర్డీఓ తెలిపింది. చీకట్లో క్షిపణి తీరును పర్యవేక్షించినట్లు వెల్లడించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
7.ఒక్కరోజే మూడు లక్షల కేసులు
కరోనా తీవ్రత తగ్గకపోగా... మరింత విజృంభిస్తోంది. ఒక్కరోజు వ్యవధిలో ఏకంగా మూడు లక్షలకు పైగా కేసులు బయటపడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా 6,333 మంది మరణించారు. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 3.20 కోట్లకు చేరింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
8.నిరాకరణ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. నవంబర్ 3న జరిగే ఎన్నికల్లో ఓడిపోతే శాంతియుతంగా అధికార బదిలీకి పాల్పడేందుకు నిరాకరించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
9.ఇదే తొలిసారి!
ముంబయి ఇండియన్స్‌తో జరిగిన తన తొలి మ్యాచ్‌లో ఓటమిపాలైంది కోల్‌కతా నైట్‌రైడర్స్. అయితే ఈ మ్యాచ్ ద్వారా తన పేరిట ఉన్న ఓ రికార్డును కోల్పోయింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
10.ఎందుకు సమన్లు ఇవ్వడం లేదు?
చిత్ర పరిశ్రమకు వచ్చిన కొత్తలో డ్రగ్స్‌కు బానిస అయ్యానంటూ ఇటీవలే కంగనా రనౌత్ ఓ వీడియోలో వెల్లడించారు. కాగా మాదక ద్రవ్యాలు తీసుకున్నట్లు కంగన స్వయంగా చెప్పినా.. ఎన్సీబీ అధికారులు ఎందుకు నోటీసులు జారీ చేయడం లేదని కాంగ్రెస్ నాయకురాలు నగ్మా ప్రశ్నించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.