ETV Bharat / state

టాప్​టెన్​ న్యూస్​@ 5PM - టాప్​టెన్​ న్యూస్​@ 5PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

top-ten-news-at-5pm
టాప్​టెన్​ న్యూస్​@ 5PM
author img

By

Published : Jun 22, 2020, 4:58 PM IST

1.కర్నల్​ కుటుంబానికి ఆర్థిక సాయం

గల్వాన్​ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో మరణించిన కర్నల్​ సంతోష్​బాబు కుటుంబాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ పరామర్శించారు. సంతోష్‌బాబు చిత్రపటానికి సీఎం నివాళులర్పించారు. కర్నల్ కుటుంబానికి రూ.5 కోట్ల ఆర్థికసాయం, భార్య సంతోషికి ఆర్డీవో ఉద్యోగ నియామక పత్రం, నివాస స్థలం పత్రాలను అందించారు. పూర్తి కథనం కోసం క్లిక్​ చేయండి.

2.గ్రేడ్లు విడుదల

కరోనా విజృంభన నేపథ్యంలో పదో తరగతి పరీక్షలు రద్దు చేసిన ప్రభుత్వం.. గ్రేడ్లు ప్రకటించింది. అంతర్గత మార్కుల ఆధారంగా గ్రేడ్లు ఇచ్చింది. నాలుగు ఫార్మేటివ్ అసెస్​మెంట్ (ఎఫ్ఏ) పరీక్షలకు ఉన్న 20 శాతం మార్కులను వందశాతానికి లెక్కించి గ్రేడ్లు ఇచ్చింది. ఇంటర్నల్ అసెస్​మెంట్ మార్కులు మార్చి నెలలోనే పాఠశాలలు.. ప్రభుత్వ పరీక్షల విభాగం ఆన్​లైన్​లో పంపించాయి. వాటి ఆధారంగా ఎస్‌ఎస్‌సీ బోర్డు గ్రేడ్లు ఇచ్చింది. పూర్తి కథనం కోసం క్లిక్​ చేయండి.

3.దోస్త్​ నోటిఫికేషన్​ విడుదల

డిగ్రీ ప్రవేశాల కోసం దోస్త్ నోటిఫికేషన్ విడుదల చేసింది. జులై 1 నుంచి 14 వరకు మొదటి విడత దోస్త్ రిజిస్ట్రేషన్లు మొదలవుతాయి. జులై 6 నుంచి 15 వరకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశమిచ్చారు. జులై 22న మొదటి విడత డిగ్రీ సీట్ల కేటాయింపు, జులై 23 నుంచి 27 వరకు విద్యార్థుల సెల్ఫ్ రిపోర్టింగ్‌కు అవకాశం ఉంటుందని ఉన్నత విద్యామండలి తెలిపింది. పూర్తి కథనం కోసం క్లిక్​ చేయండి.

4.కరోనాతో వైద్యుడు మృతి

రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా ఓ వైద్యుడు కరోనా మహమ్మారి బారిన పడి మృతి చెందాడు. నగరంలో ఓ ప్రైవేట్ క్లినిక్‌ నడుపుతున్న వైద్యుడు జ్ఞానేశ్వర్(70)వారం రోజులుగా జ్వరంతో బాధపడుతూ నగరంలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పూర్తి కథనం కోసం క్లిక్​ చేయండి.

5.రష్యాకు రాజ్​నాథ్ అందుకోసమే!

చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్ రష్యా పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ పర్యటనలో రష్యా ఎగుమతి చేసిన యుద్ధ సామగ్రికి సంబంధించి విడిభాగాలు, పరికరాలను అత్యవసరంగా సరఫరా చేయాలని రాజ్​నాథ్​ కోరనున్నట్లు సమాచారం. పూర్తి కథనం కోసం క్లిక్​ చేయండి.

6.ఘోర రోడ్డు ప్రమాదం..

మధ్యప్రదేశ్ రాజ్​గఢ్​​ జిల్లా సారంగ్​పుర్​లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీ కొన్న ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అక్కడికి చేరుకున్న స్థానికులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. పూర్తి కథనం కోసం క్లిక్​ చేయండి.

7.మళ్లీ జవాబు దాటవేసిన చైనా

గల్వాన్​ ఘర్షణలో చైనా మృతుల సంఖ్యపై ఆ దేశం మొదటి నుంచి గోప్యత పాటిస్తోంది. చైనా వైపు 40 మందికిపైగా మృతి చెందారని భారత మాజీ సైనికాధిపతి వీకే సింగ్​ వ్యాఖ్యలపై స్పందించేందుకు కూడా ఆ దేశం నిరాకరించింది. తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని చెప్పుకొస్తుంది. పూర్తి కథనం కోసం క్లిక్​ చేయండి.

8.మార్కెట్లకు లాభాలు

దేశీయ స్టాక్ మార్కెట్లు బీఎస్​ఈ, ఎన్​ఎస్​ఈలు సోమవారం లాభాలతో ముగిశాయి. బీఎస్​ఈ సూచీ సెన్సెక్స్ 179 పాయింట్లు వృద్ధి చెంది 34,911 వద్ద, ఎన్​ఎస్​ఈ సూచీ నిఫ్టీ 67 పాయింట్ల లాభంతో 10,311 వద్ద స్థిరపడ్డాయి. పూర్తి కథనం కోసం క్లిక్​ చేయండి.

9.వాళ్లే అత్యుత్తమ బ్యాట్స్​మెన్లు

టీమ్​ఇండియా కెప్టెన్​ విరాట్​ కోహ్లీ, ఆస్ట్రేలియా క్రికెటర్​ స్టీవ్​ స్మిత్​లపై ప్రశంసలు కురిపించాడు​ డేవిడ్​ వార్నర్​. కోహ్లీ, స్మిత్​ ప్రపంచంలో అత్యుత్తమ బ్యాట్స్​మెన్లని తెలిపాడు. భారత్​తో డిసెంబరులో జరగాల్సిన టెస్టు సిరీస్​ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు వార్నర్​ వెల్లడించాడు. పూర్తి కథనం కోసం క్లిక్​ చేయండి.

10.ఆ​ సినిమాపై అమృత స్పందించలేదు

ఆర్జీవీ 'మర్డర్' చిత్రంపై అమృత వ్యాఖ్యల పేరిట పత్రికల్లో, సామాజిక మాధ్యమాల్లో వస్తోన్న కథనాల గురించి తాజాగా ఆమె మామయ్య బాలస్వామి స్పందించారు. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెప్పారు. ఇప్పటివరకూ 'మర్డర్‌' సినిమా గురించి ఆమె ఏవిధంగానూ స్పందించలేదని తెలిపారు. ఆమె పేరుతో వస్తోన్న స్టేట్‌మెంట్స్‌ను నమ్మవద్దని అన్నారు. పూర్తి కథనం కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.