ETV Bharat / state

టాప్​టెన్​ న్యూస్​@ 1PM - top ten news in Telugu

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP TEN NEWS AT 1PM
టాప్​టెన్​ న్యూస్​@ 1PM
author img

By

Published : Sep 16, 2020, 1:00 PM IST

1. త్వరలోనే వార్డు ఆఫీసర్ల పోస్టులు భర్తీ చేస్తాం...

హైదరాబాద్​ ఓఆర్​ఆర్​పై 19 ఇంటర్​ చెంజ్​ల వద్ద ఫుడ్​కోర్టులు, రెస్ట్​ ఏరియాలు ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్​ తెలిపారు. ఈ గాంధీ జయంతినాటికి దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని పట్టణాలు కలిపి 11 వేల పబ్లిక్ టాయిలెట్స్ పూర్తి చేస్తున్నామన్నారు. వార్డు ఆఫీసర్‌ పోస్టులపై మండలిలో మంత్రి ప్రకటన చేశారు. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి..

2. మోదీ నిర్ణయాత్మక విధానాలు దేశానికే ఆదర్శం

మోదీ నిర్ణయాత్మక విధానాలు దేశానికే ఆదర్శనీయమని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. మోదీ నాయకత్వంలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. మోదీ దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్తున్నారని తెలిపారు. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి..

3. వ్యవసాయ క్లస్టర్ల పునర్విభజన పూర్తిచేస్తాం..

కరోనా సంక్షోభంలోనూ రైతుబంధు అందించిన ఘనత తెరాస ప్రభుత్వానిదేనని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. ఈ పథకం ద్వారా ఎన్నో కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయని చెప్పారు. ప్రతి 5 వేల ఎకరాలను ఒక క్లస్టర్‌గా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. త్వరలో క్లస్టర్ల పునర్విభజన పూర్తి చేస్తామని పేర్కొన్నారు. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి..

4. జల దిగ్బంధంలో వనపర్తి..

రాత్రి నుంచి కురుస్తున్న ఎడతెరిపిలేని వానకు... వనపర్తి జలదిగ్బంధమైంది. తాళ్లచెరువు పొంగిపొర్లడంతో రహదారులు, రోడ్లు అన్ని పూర్తిగా జలమయమైపోయాయి. నివాసాలు, వ్యాపార సముదాయాల్లోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి..

5. ఎంజీఎంలో రోగులకు తప్పని తిప్పలు..

ఓపీ విభాగంలో కంప్యూటర్లు మొరాయించడంతో రోగులు, రోగి బంధువులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఘటన వరంగల్​లోని ఎంజీఎం ఆస్పత్రిలో చోటు చేసుకుంది. అధికారుల నుంచి ఆదేశాలు వస్తే చిట్టీలు ఇస్తామని సిబ్బంది వెల్లడించారు. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి..

6. మోదీ మెచ్చిన కొయ్య బొమ్మలు..

తెలుగు రాష్ట్రాల్లో కొయ్యబొమ్మలు అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చే పేరు కొండపల్లి. అయితే ఇప్పుడు నెల్లూరులోని ఉదయగిరిలో కొండబొమ్మలూ మంచి ఆదరణ పొందుతున్నాయి. ఎంతంటే.. ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించేంతలా. ఉదయగిరి కొండల్లో లభించే కలపతో.. చిన్న కుటీర పరశ్రమలో మహిళలే ప్రధానంగా వీటిని తయారు చేస్తుండటం విశేషం. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి..

7. మోదీ హామీలు.. గాలిలో మేడలు..

కరోనా సంక్షోభంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కేంద్రం విఫలమైందని ఆరోపించారు కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్​ గాంధీ. 21 రోజుల్లో కరోనాను ఓడిస్తామంటూ గాలిలో మేడలు కట్టారని.. కానీ అవన్నీ అబద్ధాలేనని రుజువైనట్టు పేర్కొన్నారు. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి..

8. మాస్కు ధరించకపోతే.. గోతులు తవ్వాల్సిందే..

ఇండోనేసియాలోని జావాలో మాస్క్​లు ధరించకుండా బయటకు వచ్చే వారిని వినూత్నంగా శిక్షిస్తున్నారు అక్కడి అధికారులు. మాస్క్​లు లేని వారికి గోతులు తవ్వే శిక్షను విధిస్తున్నారు. కొవిడ్ కారణంగా మరణించిన వారి మృతదేహాలను పూడ్చటానికి వీటిని ఉపయోగిస్తున్నారు. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి..

9. పరుగులో అథ్లెట్లతో పాటు పిల్లి..

టర్కీ ఇస్తాంబుల్​లో జరిగిన బాల్కన్​ అండర్-20 పురుషుల అథ్లెటిక్స్​ ఛాంపియన్​షిప్​లోని వంద మీటర్ల పరుగులో ఓ పిల్లి అడ్డుగా వచ్చింది. ఈ రేసు ముగింపు రేఖ వద్ద అథ్లెట్లు సమీపిస్తున్న సమయంలో వారికి కాళ్లకు అడ్డంగా దూసుకువెళ్లింది. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

10. మెగా బ్రదర్​ నాగబాబుకు కరోనా పాజిటివ్

నటుడు, నిర్మాత నాగబాబు కొవిడ్‌-19 బారినపడ్డారు. ఇటీవల ఆయన కొవిడ్‌-19 పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.