ETV Bharat / state

Telangana News Today : టాప్​న్యూస్ @ 1PM - తెలంగాణ న్యూస్ టుడే

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Telangana News Today
Telangana News Today
author img

By

Published : Nov 3, 2022, 1:03 PM IST

DAV School Reopening Today: బంజారాహిల్స్‌ డీఏవీ పాఠశాల నిర్వహణకు విద్యాశాఖ అనుమతివ్వడంతో నేడు రీఓపెన్​ చేశారు. ఉదయం 8 గంటలకు పాఠశాలను తెరిచారు. అయితే సమాచారం లేకుండా పాఠశాలను తెరిచారంటూ బాధిత చిన్నారి కుటుంబసభ్యులు పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు.

  • మునుగోడులో భారీగా నగదు పట్టివేత.. కారులో తరలిస్తుండగా..!

మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్​ జరుగుతున్న వేళ భారీగా నగదు పట్టుబడింది. నియోజకవర్గంలోని నాంపల్లి మండలం మల్లప్పరాజుపల్లిలో రూ.10 లక్షలు తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. ఓ కారులో తెరాస శ్రేణులు నగదు తరలిస్తున్నారన్న భాజపా శ్రేణుల ఆరోపణల నేపథ్యంలో తనిఖీలు నిర్వహించిన అధికారులు.. రూ.10 లక్షలను స్వాధీనం చేసుకున్నారు.

  • జోడో యాత్రలో రాహుల్ జోష్

Bharat Jodo Yatra: భాజపా పాలన నుంచి దేశాన్ని రక్షించే ఉద్దేశంతో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర రాష్ట్రంలో ఉత్సాహంగా సాగుతోంది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సంగారెడ్డి జిల్లాలో కొనసాగుతోంది. పాదయాత్ర మధ్యలో ఓ చోట ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. రాహుల్ గాంధీ ఎమ్మెల్యే జగ్గారెడ్డితో కలిసి పోతురాజులాగా.. కొరడాతో ఆడిపాడి ఆకట్టుకున్నారు. కార్యకర్తల్లో ఫుల్ జోష్​ నింపారు.

  • మద్యం మత్తులో గ్యాంగ్​ వార్

మద్యం మత్తులో రెండు గ్యాంగ్​ల మధ్య గొడవ తలెత్తింది. పరస్పర దాడుల్లో ఓ యువకుడి చేయి తెగి పడిపోయింది. దీంతో ఆ యువకుడు అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. ఈ ఘటన బెంగళూరులో జరిగింది.

  • జపాన్​ను హడలెత్తించిన కిమ్.. బుల్లెట్ రైళ్లకు బ్రేక్

కొన్నినెలల నుంచి ఆయుధ పరీక్షలతో ఉద్రిక్తతలకు కారణమైన ఉత్తరకొరియా మరింత దూకుడు పెంచింది. నిన్న 23 క్షిపణి పరీక్షలు నిర్వహించిన మరుసటిరోజే ఖండాంతర క్షిపణి సహా మూడు మిస్సైళ్లను పరీక్షించింది. ఈ పరీక్షల నేపథ్యంలో జపాన్‌ తమ ప్రజలను అప్రమత్తం చేసింది. బుల్లెట్‌ రైళ్లను తాత్కాలికంగా నిలిపివేసింది.

  • కోహ్లీ 'ఫేక్​ ఫీల్డింగ్'

టీమ్​ఇండియాతో జరిగిన మ్యాచ్​పై ఓటమి బాధలో ఉన్న బంగ్లాదేశ్​.. ముగిసిపోయిన మ్యాచ్ ఫలితాన్ని మార్చాలనే ప్రయత్నంతో ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే బంగ్లా జట్టు కొత్త వివాదానికి తెరలేపింది. కోహ్లీపై విమర్శలు చేసింది. ఏంటంటే..

  • సుక్కుతో చరణ్ కొత్త​ సినిమా షురూ చేశారా

రంగస్థలం సినిమాతో క్రేజీ కాంబోగా పేరు తెచ్చుకున్నారు సుకుమార్​-రామ్​చరణ్​. అయితే వీరిద్దరి కాంబోలో మరో సినిమా వస్తే చూడాలని భావిస్తున్న ప్రేక్షకులకు ఓ గుడ్​న్యూస్​. అదేంటంటే..

  • ఈ శుక్రవారం థియేటర్లలో సందడంతా ఈ భామలదే

ఎప్పటిలాగే ఈ శుక్రవారం కూడా కొన్ని సినిమాలు విడుదల కాబోతున్నాయి. వీరిలో జాన్వీకపూర్​, అను ఇమ్మాన్యుయెల్​, ఫరియా అబ్దుల్లా సహా పలువురు భామలు ఉన్నారు. ఇంతకీ వారెవరు ఏ చిత్రాలతో సందడి చేయనున్నారో ఓ సారి చూద్దాం.

  • గుజరాత్ ఎన్నికల నోటిఫికేషన్​ విడుదల

Gujarat Election Date : గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్​ను ప్రకటించింది ఎన్నికల సంఘం. పోలింగ్​, కౌంటింగ్​ తదితర తేదీలను వెల్లడించింది.

  • జోరందుకున్న 'మునుగోడు' పోలింగ్

Munugode By poll Voting: మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా ఉపఎన్నిక పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం మందకొడిగా సాగిన ఓటింగ్.. అనంతరం గంటగంటకూ జోరందుకుంటోంది. పలుచోట్ల ఈవీఎంలు మొరాయించగా.. కాసేపు పోలింగ్‌ నిలిచిపోయింది. మరమ్మతుల అనంతరం యధావిధిగా పోలింగ్‌ కొనసాగుతోంది.

  • డీఏవీ స్కూల్​ రీఓపెన్.. ఎలా తెరుస్తారంటూ తల్లిదండ్రుల ఆందోళన

DAV School Reopening Today: బంజారాహిల్స్‌ డీఏవీ పాఠశాల నిర్వహణకు విద్యాశాఖ అనుమతివ్వడంతో నేడు రీఓపెన్​ చేశారు. ఉదయం 8 గంటలకు పాఠశాలను తెరిచారు. అయితే సమాచారం లేకుండా పాఠశాలను తెరిచారంటూ బాధిత చిన్నారి కుటుంబసభ్యులు పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు.

  • మునుగోడులో భారీగా నగదు పట్టివేత.. కారులో తరలిస్తుండగా..!

మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్​ జరుగుతున్న వేళ భారీగా నగదు పట్టుబడింది. నియోజకవర్గంలోని నాంపల్లి మండలం మల్లప్పరాజుపల్లిలో రూ.10 లక్షలు తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. ఓ కారులో తెరాస శ్రేణులు నగదు తరలిస్తున్నారన్న భాజపా శ్రేణుల ఆరోపణల నేపథ్యంలో తనిఖీలు నిర్వహించిన అధికారులు.. రూ.10 లక్షలను స్వాధీనం చేసుకున్నారు.

  • జోడో యాత్రలో రాహుల్ జోష్

Bharat Jodo Yatra: భాజపా పాలన నుంచి దేశాన్ని రక్షించే ఉద్దేశంతో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర రాష్ట్రంలో ఉత్సాహంగా సాగుతోంది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సంగారెడ్డి జిల్లాలో కొనసాగుతోంది. పాదయాత్ర మధ్యలో ఓ చోట ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. రాహుల్ గాంధీ ఎమ్మెల్యే జగ్గారెడ్డితో కలిసి పోతురాజులాగా.. కొరడాతో ఆడిపాడి ఆకట్టుకున్నారు. కార్యకర్తల్లో ఫుల్ జోష్​ నింపారు.

  • మద్యం మత్తులో గ్యాంగ్​ వార్

మద్యం మత్తులో రెండు గ్యాంగ్​ల మధ్య గొడవ తలెత్తింది. పరస్పర దాడుల్లో ఓ యువకుడి చేయి తెగి పడిపోయింది. దీంతో ఆ యువకుడు అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. ఈ ఘటన బెంగళూరులో జరిగింది.

  • జపాన్​ను హడలెత్తించిన కిమ్.. బుల్లెట్ రైళ్లకు బ్రేక్

కొన్నినెలల నుంచి ఆయుధ పరీక్షలతో ఉద్రిక్తతలకు కారణమైన ఉత్తరకొరియా మరింత దూకుడు పెంచింది. నిన్న 23 క్షిపణి పరీక్షలు నిర్వహించిన మరుసటిరోజే ఖండాంతర క్షిపణి సహా మూడు మిస్సైళ్లను పరీక్షించింది. ఈ పరీక్షల నేపథ్యంలో జపాన్‌ తమ ప్రజలను అప్రమత్తం చేసింది. బుల్లెట్‌ రైళ్లను తాత్కాలికంగా నిలిపివేసింది.

  • కోహ్లీ 'ఫేక్​ ఫీల్డింగ్'

టీమ్​ఇండియాతో జరిగిన మ్యాచ్​పై ఓటమి బాధలో ఉన్న బంగ్లాదేశ్​.. ముగిసిపోయిన మ్యాచ్ ఫలితాన్ని మార్చాలనే ప్రయత్నంతో ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే బంగ్లా జట్టు కొత్త వివాదానికి తెరలేపింది. కోహ్లీపై విమర్శలు చేసింది. ఏంటంటే..

  • సుక్కుతో చరణ్ కొత్త​ సినిమా షురూ చేశారా

రంగస్థలం సినిమాతో క్రేజీ కాంబోగా పేరు తెచ్చుకున్నారు సుకుమార్​-రామ్​చరణ్​. అయితే వీరిద్దరి కాంబోలో మరో సినిమా వస్తే చూడాలని భావిస్తున్న ప్రేక్షకులకు ఓ గుడ్​న్యూస్​. అదేంటంటే..

  • ఈ శుక్రవారం థియేటర్లలో సందడంతా ఈ భామలదే

ఎప్పటిలాగే ఈ శుక్రవారం కూడా కొన్ని సినిమాలు విడుదల కాబోతున్నాయి. వీరిలో జాన్వీకపూర్​, అను ఇమ్మాన్యుయెల్​, ఫరియా అబ్దుల్లా సహా పలువురు భామలు ఉన్నారు. ఇంతకీ వారెవరు ఏ చిత్రాలతో సందడి చేయనున్నారో ఓ సారి చూద్దాం.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.