ETV Bharat / state

Top News: టాప్​టెన్​ ​న్యూస్ @11AM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Top News: టాప్​టెన్​ ​న్యూస్ @11AM
Top News: టాప్​టెన్​ ​న్యూస్ @11AM
author img

By

Published : Mar 16, 2022, 10:58 AM IST

  • దేశవ్యాప్తంగా ఐటీ సోదాలు..

IT department raids: దేశంలోని అనేక ప్రదేశాల్లో ఆదాయపు పన్ను శాఖ సోదాలు నిర్వహించింది. పన్ను ఎగవేతకు సంబంధించిన కేసులో ఈ సోదాలు చేపట్టింది. మరోవైపు, అక్రమాస్తుల కేసులో భాగంగా కర్ణాటక ఏసీబీ దాడులు నిర్వహిస్తోంది. 400 మంది అధికారులు, సిబ్బంది ఇందులో భాగమయ్యారు.

  • పోలీసుల ఎన్​కౌంటర్..

అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడిని అసోం పోలీసులు ఎన్​కౌంటర్ చేశారు. తమ కస్టడీ నుంచి పారిపోయేందుకు నిందితుడు ప్రయత్నించాడని, తమపైనా దాడి చేశాడని గువాహటి పోలీసులు వెల్లడించారు. అందుకే కాల్పులు జరిపినట్లు తెలిపారు. మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగిందని చెప్పారు.

  • మళ్లీ పెరిగిన కరోనా కేసులు

Covid Cases In India: భారత్​లో రోజువారీ కరోనా​ కేసులు స్వల్పంగా పెరిగాయి. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు 2,876 మంది కొవిడ్ బారిన పడ్డారు. మరో 98 మంది మరణించారు. కొత్తగా 3,884 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.

  • ముగ్గురిదీ "సేమ్​ పించ్​"..

ముగ్గురి పేర్లు ఒకటే ఉండటం సర్వసాధారణం. వాళ్లు చదువుకున్న పాఠశాల కూడా ఒకే కావటం సాధారణమే. అందులోనూ వాళ్లు ఒకే తరగతి కావటం కూడా కొన్నిసార్లు జరిగేదే. చివరికి వాళ్లకు ఒకే ప్రభుత్వ ఉద్యోగం రావటం... అది కూడా ఒకే కార్యాలయంలో విధులు నిర్వర్తించాల్సి రావటం.. మాత్రం అస్సలు సాధారణ విషయం కాదు. ఇది మాత్రం విడ్డూరమే..! మరి.. అన్నింట్లోనూ "సేమ్​ పించ్​"​ అంటున్న ఆ ముగ్గరు మౌనికల కథ మీరూ చూసేయండి.

  • సజ్జనార్ మామూలుగా వాడలేదుగా

Sajjanar Tweet About RRR : తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్.. ఆర్టీసీ పబ్లిసిటీ విషయంలో తగ్గేదేలే అంటూ దూసుకెళ్తున్నారు. సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ.. ట్వీట్స్, మీమ్స్, ట్రోల్స్ ఇలా దేన్నీ వదలకుండా.. కాదేదీ పబ్లిసిటీకి అనర్హం అంటూ అన్నింటిని వాడేస్తున్నారు. తాజాగా ఆర్‌ఆర్‌ఆర్‌ టైటిల్‌ను ఆ సినిమాలోని 'నెత్తురు మరిగితే ఎత్తర జెండా' పాటని కూడా సజ్జనార్.. ఆర్టీసీ పబ్లిసిటీకి ఉపయోగించారు.

  • నీట్‌ కటాఫ్‌ మార్కుల తగ్గింపు

కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కీలక నిర్ణయం తీసుకొంది. నీట్‌ 2021 పీజీ వైద్యవిద్య కటాఫ్‌ మార్కులను 15 పర్సంటైల్‌ తగ్గించింది. తాజా నిర్ణయానికి అనుగుణంగా కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం మంగళవారం మరోసారి ప్రవేశ ప్రకటనను విడుదల చేసింది.

  • ప్రేమను పుట్టించడానికీ మందులా...?

జ్వరం తగ్గటానికి మందులేసుకుంటాం. నొప్పులు తగ్గటానికి మాత్రలేసుకుంటాం. మరి ప్రేమ పుట్టటానికో? ప్రేమను పుట్టించే మందులా? అంతలా ఆశ్చర్యపోనవసరం లేదు. ‘ప్రేమ ఔషధాల’ వాడకం ఇటీవల బాగానే పెరిగిపోతోంది. కాకపోతే నైతిక విలువల పరంగానే కొన్ని సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

  • ఏ రోడ్డులో ఎంత స్పీడ్‌లో వెళ్లాలో తెలుసా..?

రాష్ట్ర రాజధానిలో.. ఏ రోడ్డుపై ఎంత వేగంతా వెళ్లాలో వాహనదారులకు తెలపడానికి ట్రాఫిక్ పోలీసులు ఓ ప్లాన్ సిద్ధం చేశారు. రహదారులను మూడు కేటగిరీలుగా విభజించి వారి అయోమయానికి తెరదించనున్నారు. దీనివల్ల పరిమితికి మించిన వేగంతో వెళ్లే వాహనదారులకు చలానాలు విధించి కట్టడి చేయనున్నారు.

  • భారీ లాభాల్లో స్టాక్​ మార్కెట్లు

అంతర్జాతీయంగా సానుకూల సంకేతాల నేపథ్యంలో.. దేశీయ స్టాక్​ మార్కెట్​ సూచీలు బుధవారం భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ 800 పాయింట్లకుపైగా పెరిగి 56 వేల 600 ఎగువన ట్రేడవుతోంది.

  • మళ్లీ పెళ్లి చేసుకున్న 'మహేశ్​' హీరోయిన్​

బాలీవుడ్​ నటి అమృతా రావ్​ మళ్లీ పెళ్లిచేసుకుంది. ఈ మేరకు ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది. ఇక్కడే ఓ ట్విస్ట్​ ఉంది. ఇంతకీ ఆమె ఎవరిని పెళ్లి చేసుకుందంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.