ETV Bharat / state

Top News: టాప్​టెన్​ ​న్యూస్ @ 7AM - తెలంగాణ టాప్ న్యూస్

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Top News: టాప్​టెన్​ ​న్యూస్ @ 7AM
Top News: టాప్​టెన్​ ​న్యూస్ @ 7AM
author img

By

Published : Mar 15, 2022, 7:00 AM IST

  • నేటితో ముగియనున్న సమావేశాలు

నేటితో బడ్జెట్‌ సమావేశాలు ముగియనున్నాయి. చివరిరోజైన ఇవాళ ద్రవ్యవినిమయ బిల్లుపై ఉభయసభల్లో చర్చజరగనుంది. ఈనెల 7 నుంచి ప్రారంభమైన సమావేశాల్లో... అదే రోజు వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. 9న బడ్జెట్​పై సాధారణ చర్చ... ఆ తర్వాత నాలుగు రోజుల పాటు పద్దులపై చర్చ జరిగింది. మొత్తం 37 పద్దులు... శాసనసభ ఆమోదం పొందాయి.

  • చట్ట సవరణ బిల్లులకు ఆమోదం

Telangana Assembly: రుణపరిమితి, మార్కెట్ కమిటీల చట్ట సవరణ బిల్లులకు శాసనసభ ఆమోదముద్ర వేసింది. అప్పుల భారం మరింతగా పెరిగేలా రాష్ట్ర ప్రభుత్వం చట్టసవరణ చేయడం తగదని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. దేశ సగటు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల కంటే... రాష్ట్ర అప్పుల శాతం తక్కువగానే ఉందని ప్రభుత్వం తెలిపింది.

  • 2024లో ప్రజాప్రభుత్వాన్ని స్థాపిస్తాం: పవన్

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతేనని.. రాష్ట్ర రాజధాని ఎక్కడికీ తరలిపోయే ప్రసక్తేలేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. వైకాపా ప్రజావ్యతిరేక విధానాలపై యుద్ధం కొనసాగుతుందన్న జనసేనాని.. 2024 ఎన్నికల్లో ప్రజాప్రభుత్వాన్ని స్థాపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. జనసేన పార్టీ 9వ ఆవిర్భావ సభ గుంటూరు జిల్లా ఇప్పటంలో ఘనంగా జరిగింది. ఈ బహిరంగ సభలో సుదీర్ఘంగా ప్రసంగించిన పవన్.. ప్రభుత్వ విధానాలను తూర్పారబడుతూ.. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

  • ఎల్బీనగర్‌ అండర్‌పాస్‌ను ప్రారంభించనున్న కేటీఆర్‌

Lbnagar Underpass: ఎల్బీనగర్ అండర్‌పాస్, బైరామల్‌గూడ పైవంతెనను.... ఇవాళ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించనున్నారు. సిగ్నల్ ఫ్రీ నగరంగా ఏర్పాటు చేసేందుకు ఫ్లై ఓవర్లు, స్కైవేలు, మేజర్ కారిడార్లు, అండర్‌పాలను... ఎస్​ఆర్​డీపీ పథకం కింద జీహెచ్ఎంసీ నిర్మిస్తోంది.

  • కోటి మందికి ఉచిత సిలిండర్లు

Free gas cylinder in UP: ఉత్తర్​ప్రదేశ్​ శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు భాజపా సిద్ధం అవుతోంది. ఉచిత గ్యాస్​ సిలిండర్లు.. హోలీ రోజు నుంచే అందించనున్నట్లు సమాచారం.

  • కబడ్డీ ఆటగాడిని కాల్చిచంపిన దుండగులు

Kabaddi Player Sandeep Nangal: పంజాబ్​లోని జలంధర్​లో ఓ కబడ్డీ ఆటగాడు హత్యకు గురయ్యాడు. మలియన్​ కలన్​ గ్రామంలో కబడ్డీ టోర్నమెంట్​ జరుగుతున్న సమయంలో నలుగురు దుండగులు ఆటగాడిని కాల్చిచంపారు. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

  • 'ఫైట్​కు రెడీనా'.. పుతిన్​కు మస్క్​ సవాల్​

Elon Musk Challenges Russia: ఉక్రెయిన్​పై రష్యా దాడుల నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​కు సవాలు విసిరారు టెస్లా సీఈఓ ఎలాన్​ మస్క్​. పుతిన్​ తనతో పోరాడాలని... గెలిచినవారు ఉక్రెయిన్‌-రష్యా యుద్ధంపై తుది నిర్ణయం తీసుకుంటారని పేర్కొంటూ ట్వీట్​ చేశారు.

  • అంతర్జాతీయ కరెన్సీగా రూపాయి!

Indian Rupee: రష్యాపై పశ్చిమ దేశాల ఆర్థిక ఆంక్షలు విధిస్తున్న నేపథ్యంలో పలు దేశాలు ప్రత్యామ్నాయాలపై దృష్టి సారిస్తున్నాయని.. రూపాయిని గ్లోబల్​ కరెన్సీగా వినియోగించడానికి ఇదే మంచి అవకాశమని ఎస్​బీఐ తన నివేదికలో పేర్కొంది. కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ, దీనివల్ల లావాదేవీల వ్యయం తగ్గుతుందని తెలిపింది.

  • ప్లేఆఫ్స్​కు చేరుకునే జట్లు ఇవేనా?

IPL 2022: ఐపీఎల్​ కోసం ప్రతి సీజన్​లోనూ ఉత్కంఠగా ఎదురుచూస్తారు అభిమానులు. తమ జట్టు కప్పు గెలుస్తుందంటే.. తమ జట్టే అంటూ పోటీ పడుతుంటారు. పది జట్లు పాల్గొంటున్న ఈ మెగా టోర్నీలో ఏ జట్లకు ప్లేఆఫ్స్​​ అవకాశాలు ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దాం.

  • హిట్​పెయిర్​.. మళ్లీ వస్తున్నారు

వెండితెరపై కొన్ని జంటల మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్​ అవుతుంది. ఆ జోడీ మళ్లీ కలిసి నటిస్తే అభిమానుల్లో సినిమాపై ఆసక్తి రెట్టింపు అవుతుంది. అందుకే దర్శకనిర్మాతలు కూడా వారిని కొనసాగించేందుకు ఇష్టపడుతుంటారు. అలా ఇప్పుడు రెండోసారి జట్టు కట్టిన జంటలు చాలానే ఉన్నాయి. ఓ సారి ఆ హిట్​ పెయిర్స్​ ఏంటి? ఏ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారో తెలుసుకుందాం..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.