సర్కారు కీలక నిర్ణయం!
కొవిడ్ విజృంభణ నేపథ్యంలో లాక్‌డౌన్‌పై రాష్ట్ర మంత్రివర్గం ఇవాళ కీలక నిర్ణయం తీసుకోనుంది. మధ్యాహ్నం భేటీ కానున్న కేబినెట్... లాక్డౌన్ విధించే అంశంపై పూర్తిస్థాయిలో చర్చించి ఓ నిర్ణయానికి రానుంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
చిన్నారులకు కరోనా ముప్పు
కరోనా మహమ్మారి దక్షిణాదిలో మే ఆఖరుకు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని... ప్రముఖ వైరాలజిస్టు డాక్టర్ వి.రవి తెలిపారు. మొదటిదశలో 4 శాతం మంది పిల్లలే కొవిడ్ బారిన పడ్డారని... ప్రస్తుతం అది 15 నుంచి 20 శాతం ఉందని అన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
నేడు అత్యవసర విచారణ
రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై నేడు హైకోర్టు మరోసారి విచారణ చేపట్టనుంది. ఈనెల 5న విచారణ జరిపిన హైకోర్టు.. పలు ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
5 నిమిషాలు ఆలస్యం.. 11 మంది మృతి
అప్పటివరకూ ప్రశాంతంగా ఉన్న ఆస్పత్రిలో..ఒక్కసారిగా అలజడి రేగింది. అత్యవసర పరిస్థితుల్లో చికిత్స పొందుతున్న వారికి ప్రాణవాయువు సరఫరా నిలిచిపోయింది. యంత్రాలు హెచ్చరించడం మొదలుపెట్టాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
కొత్త ఆయుధాలు
కరోనా వ్యాప్తి నేపథ్యంలో సాంకేతికత కీలక పాత్ర పోషిస్తోంది. దైనందిన జీవితాల్లో డిజిటల్ చెల్లింపులతో మొదలుకుని టెలీవైద్యం, వర్చువల్ సమావేశాలు, డ్రోన్ల వినియోగం వంటివి పెరిగాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
ఇదీ మూల్యం!
కొవిడ్ సంక్షోభంతో భారత్‌లో కొరవడిన వైద్యసేవలు, స్వాస్థ్య వ్యవస్థ పరిమితులు బట్టబయలయ్యాయి. 2021-22 వార్షిక బడ్జెట్‌లో తమకు సుమారు లక్షా 21వేల కోట్ల రూపాయలు అనుగ్రహించాల్సిందిగా కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ కోరినా.. అందులో రూ.50వేల కోట్లు కోతపెట్టినట్లు పార్లమెంటరీ స్థాయీసంఘం నివేదికాంశాలే చాటుతున్నాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
లింకు తెరిస్తే అంతే!
కొవిడ్ వ్యాక్సిన్‌కు సంబంధించి ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ ఆధారంగా పనిచేసే స్మార్ట్ఫోన్లకు నకిలీ మెసేజ్‌లు వస్తున్నాయని నిఘా అధికారులు గుర్తించారు. వాటి ద్వారా ఫోన్లలోని డేటాను సైబర్ నేరగాళ్లు కాజేస్తున్నారని తెలిపారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
పెట్రో బాదుడు
దేశంలో మరోసారి చమురు ధరలు పెరిగాయి. లీటరుకు 24 నుంచి 32 పైసలు వరకు పెంచినట్లు చమురు సంస్థలు తెలిపాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
రియల్ లైఫ్ హీరోలు
కష్టమన్న మాట వినిపించిన ప్రతిసారీ కన్నీళ్లు తుడిచేందుకు మేమున్నామంటూ ముందుకొస్తుంటారు సినీ ప్రముఖులు. తమ వంతు సాయమందించి ఆపన్నులకు అండగా నిలుస్తుంటారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
ఐపీఎల్ మ్యాచ్‌లు భారత్‌లో జరగవు
కొవిడ్ నేపథ్యంలో నిరవధికంగా వాయిదా పడిన ఐపీఎల్ మిగతా మ్యాచ్‌లు భారత్‌లో జరగవని స్పష్టతనిచ్చాడు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు మ్యాచ్‌లకు నిర్వహణ పరమైన అడ్డంకులు ఉన్నాయని పేర్కొన్నాడు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.