ఇద్దరు రైతులు మృతి
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం బల్లూనాయక్ తండాలో విషాదం చోటుచేసుకుంది. బావిలో పూడిక తీస్తుండగా ప్రమాదం జరిగి ఇద్దరు రైతులు మృతి చెందారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
రోజూ విడుదల చేయాలి
రేపటి నుంచి కరోనా బులెటిన్ రోజూ విడుదల చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై విచారణ చేపట్టిన న్యాయస్థానం వీలైనంత త్వరగా సీరం సర్వే పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
రెండో రోజు
రెండోరోజు మేడారం జాతర ఘనంగా సాగుతోంది. వనదేవతలకు దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క కుటుంబసమేతంగా సమక్కసారలమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
పోరాటం చేయలేకపోతోంది
భాజపాలో చేరిన తర్వాత తొలిసారిగా ఆ పార్టీ కార్యాలయానికి మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై కాంగ్రెస్ పోరాటం చేయకపోవడంతోనే దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల్లో ప్రజలు భాజపాకు పట్టం కట్టారని చెప్పారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
పబ్లిక్ పరీక్షలు రద్దు
తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 9,10,11 తరగతుల పబ్లిక్ పరీక్షలను రద్దు చేసింది. పరీక్షలు లేకుండానే ఆయా తరగతుల విద్యార్థులను ప్రమోట్ చేస్తున్నట్టు పేర్కొంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
శంకుస్థాపన
ప్రధాని నరేంద్ర మోదీ.. పుదుచ్చేరి పర్యటనలో పలు అభివృద్ధి ప్రాజెక్ట్‌లను ప్రారంభించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
ఊరట
టూల్‌కిట్ కేసులో శంతను ములుక్‌కు అరెస్టు నుంచి రక్షణ లభించింది. మార్చి 9 వరకు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది దిల్లీ న్యాయస్థానం. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
సంపూర్ణ విజయం!
తమ దేశంలో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించినట్లు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ప్రకటించారు. గత నాలుగు దశాబ్దాలలో 77 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చినట్లు చెప్పారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
ఇదే మొదటిసారా?
ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం మొతేరాకు నరేంద్ర మోదీ స్టేడియంగా పేరు మార్చారు. అయితే ఇలా ఓ రాజకీయ నాయకుడి పేరు క్రికెట్ స్టేడియానికి పెట్టడం కొత్తేం కాదు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
తారల సందడి
దర్శకుడు సుకుమార్ కుమార్తె ఫంక్షన్ అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకకు మహేశ్‌బాబు, ఎన్టీఆర్ సహా పలువురు నటీనటులు హాజరై సందడి చేశారు. దీనికి సంబంధించిన పలు ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.