- పార్టీలో అంతర్గత విభేదాలు... ఆందోళనలో కాంగ్రెస్ శ్రేణులు
రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు పెరుగుతున్నాయి. కులాలు వారీగా, వర్గాల వారీగా పార్టీలో కుంపటి రగులుతోంది. ఒక వర్గం సభ్యులు పీసీసీ అధ్యక్షుడికి తెలియకుండానే పోలీసు కేసులు పెట్టగా... మరో వర్గం వారు పార్టీ కోర్ కమిటీ సమావేశం ఏర్పాటుకు డిమాండ్ చేస్తున్నారు. పూర్తి వివరాలకై క్లిక్ చేయండి
- ఎంసెట్ సహా ప్రవేశ పరీక్షలన్నీ సెప్టెంబరులోనే!
ఎంసెట్ సహా ప్రవేశపరీక్షలన్నీ సెప్టెంబరులోనే నిర్వహించాలని ఉన్నత విద్యామండలి యోచిస్తోంది. జేఈఈ మెయిన్, నీట్‌కు సుప్రీంకోర్టు పచ్చజెండా ఊపిన నేపథ్యంలో హైకోర్టు కూడా ప్రవేశ పరీక్షలకు అభ్యంతరం చెప్పదని అధికారులు భావిస్తున్నారు. ఒకట్రెండు రోజుల్లో పరీక్షల తేదీలను ప్రకటించనున్నారు. పూర్తి వివరాలకై క్లిక్ చేయండి
- రాష్ట్రంలో మద్యం అమ్మకాలు తగ్గినా జోరుగా ఆదాయం
రాష్ట్రంలో జులై నెలలో మద్యం అమ్మకాలు తగ్గినా ఆదాయం మాత్రం తగ్గలేదు. సుమారు రూ.2,507 కోట్ల మద్యం... దుకాణాలకు సరఫరా అయింది. మద్యం ధరలు పెరగడంతోపాటు పొరుగునే ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు సరకు తరలిపోతుండటం ఆదాయం పెరగడానికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. పూర్తి వివరాలకై క్లిక్ చేయండి
- కూతురు నగ్న చిత్రాలు తీసిన తండ్రి... నిందితుడు అరెస్ట్
''నీకు భార్య చనిపోతే మా అమ్మను పెళ్లి చేసుకుని తనకు కొత్త జీవితం ఇచ్చావు. నన్ను ప్రేమగా చూసుకున్నావ్. తండ్రి లేని లోటును నువ్వే తీర్చావు. కొండంత ధైర్యంగా అండగా నిలిచావు. నాకు ఏ ఆపద వచ్చినా నన్ను రక్షిస్తావనే భరోసాను ఇచ్చావు. కానీ... నువ్వేందుకు ఇలా చేశావు నాన్న. నీ ల్యాప్‌టాప్‌లో నా చిత్రాలు చూడగానే నాకు భయం వేయలేదు. నువ్వేనా ఇలా చేసింది అని బాధ వేసింది.'' - ఓ కూతురి మనోవేదన పూర్తి వివరాలకై క్లిక్ చేయండి
- ఓబుళాపురం ప్రాంతంలో ఇనుప ఖనిజం లీజుకు పర్మిట్లు
ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక సరిహద్దులోని ఓబుళాపురం ప్రాంతంలో ఇనుప ఖనిజం లీజుకు గనుల శాఖ అధికారులు పర్మిట్లు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఆ ప్రాంతంలో ఉన్న ఇతర లీజులకు కూడా అధికారులు అప్పటి నుంచి పర్మిట్లు జారీ చేయడం లేదు. శ్రీ సాయి బాలాజీ మినరల్స్‌కు మాత్రం రెండు వారాల కిందట క్రితం పర్మిట్ జారీ చేశారు. పూర్తి వివరాలకై క్లిక్ చేయండి
- మరింత క్షీణించిన ప్రణబ్ ఆరోగ్యం
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం క్షీణిస్తోందని ఆర్మీ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఆయనకు వెంటిలేటర్‌పైనే చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఆర్మీ ఆసుపత్రి తాజా హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. పూర్తి వివరాలకై క్లిక్ చేయండి
- కరోనాను జయించిన 103 ఏళ్ల వృద్ధుడు
కేరళకు చెందిన 103 ఏళ్ల వృద్ధుడు కరోనాను జయించాడు. ఇరవై రోజుల వ్యవధిలోనే వైరస్ నుంచి కోలుకొని ఔరా అనిపించాడు. రాష్ట్రంలో కరోనా నుంచి బయటపడిన అతిపెద్ద వయస్కుల్లో రెండో వ్యక్తి ఈయనే. కేరళలో ఇటీవల 105 ఏళ్ల వృద్ధురాలు కరోనాను జయించింది. పూర్తి వివరాలకై క్లిక్ చేయండి
- 'ట్రంప్ మరోసారి అధికారంలోకి వస్తే అంతే'
అమెరికా అధ్యక్ష పదవి అంటే అవమానించడమే అనే భావనలో డొనాల్డ్ ట్రంప్ ఉన్నారని తీవ్ర విమర్శలు చేశారు ఆ దేశ మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్. ట్రంప్ మరోసారి అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందో అమెరికన్లకు తెలుసన్నారు. జో బైడెన్ అధికారంలోకి వస్తే పదవీ బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తారని ప్రశంసలు కురిపించారు. పూర్తి వివరాలకై క్లిక్ చేయండి
- 'ధోనీ'ని కెప్టెన్‌గా సూచించడానికి సచిన్ చెప్పిన కారణమిదే..!
తొలి టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టుకు ధోనీ కెప్టెన్‌గా ఉంటే బాగుంటుందని తానే సూచించినట్టు తెలిపారు భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందుల్కర్. స్లిప్‌లో ఫీల్డింగ్‌లో ఉన్నప్పుడు కీపర్ అయిన మహీ ఆలోచన విధానం, క్రికెట్ పరిజ్ఞానం చూసే తన నిర్ణయం చెప్పినట్లు పేర్కొన్నారు మాస్టర్. పూర్తి వివరాలకై క్లిక్ చేయండి
- సుశాంత్ కేసును సీబీఐకి అప్పగించిన సుప్రీంకోర్టు
సుశాంత్ మృతి కేసులో నటి రియా చక్రవర్తికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తనపై నమోదైన కేసును పట్నా నుంచి ముంబయికి బదిలీ చేయాలన్న ఆమె అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ మేరకు బుధవారం తుదితీర్పు వెలువరించింది. ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేయాలని పేర్కొంది అత్యున్నత న్యాయస్థానం. పూర్తి వివరాలకై క్లిక్ చేయండి