ETV Bharat / state

రేపు హాజరుపర్చండి - pitition

నలుగురు సహచర ఉద్యోగులను పోలీసులు అక్రమంగా నిర్బంధించారని ఐటీ గ్రిడ్ సంస్థ సీఈవో అశోక్ దాఖలు చేసిన పిటిషన్​పై విచారణ చేపట్టారు.

రేపు హాజరుపర్చండి
author img

By

Published : Mar 3, 2019, 9:39 PM IST

Updated : Mar 3, 2019, 10:25 PM IST

హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌
ఐటీగ్రిడ్ కంపెనీకి చెందిన నలుగురు ఉద్యోగులను రేపు ఉదయం 10.30కు తమ ఎదుట హాజరు పరచాలని ప్రతివాదులకు తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. మాదాపూర్‌ అయ్యప్ప సొసైటీలోని ఐటీగ్రిడ్ కంపెనీలో నలుగురు ఉద్యోగులు కనిపించడం లేదని ఆ సంస్థ సీఈవో అశోక్‌ హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. తెలంగాణ హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, సైబర్‌ క్రైం విభాగం ఎస్‌హెచ్‌వో, మాదాపూర్‌ ఇన్‌స్పెక్టర్‌లను ప్రతివాదులుగా పేర్కొన్నారు.

హౌస్ మోషన్ పిటిషన్ స్వీకరించిన న్యాయమూర్తులు జస్టిస్‌ చౌహాన్‌, జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌ సాయంత్రం కుందన్​బాగ్‌లోని న్యాయమూర్తుల నివాసంలో విచారణ చేపట్టారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది సుబ్బారావు వాదనలను వినిపించారు. నోటీసులు ఇవ్వకుండానే ఐటీగ్రిడ్‌ సంస్థకు చెందిన నలుగురు ఉద్యోగులను తెలంగాణ పోలీసులు నిర్బంధించారని వివరించారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తులు భాస్కర్, ఫణి, చంద్రశేఖర్, విక్రమ్‌లను రేపు తమ ఎదుట హాజరు పరచాలని ఆదేశించారు.

ఇవీ చదవండి:చిరుత కలకలం

Intro:రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి వారి ఆలయంలో మహాశివరాత్రి ఏర్పాట్లను అంగరంగ వైభవంగా ఏర్పాటు చేసినట్లుగా వేములవాడ ఎమ్మెల్యే రమేష్ బాబు అన్నారు జాతర ఏర్పాట్లపై ఆలయ పరిసరాలు గుడి చెరువు తదితర ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ వెంకట్ రామ్ రెడ్డి తో కలిసి ఆయన పరిశీలించారు గుడి చెరువులో ఉచిత ప్రసాదాల వితరణ ప్రారంభించారు శివార్చన కార్యక్రమం కోసం చేస్తున్న ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు

Body:జాతర ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా పరిపాలన అధికారి వెంకట్రాంరెడ్డి ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు

Conclusion:()బైట్: చెన్నామనేని రమేష్ బాబు, ఎమ్మెల్యే
Last Updated : Mar 3, 2019, 10:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.