Temperature in TS: రాష్ట్రంలో భానుడి భగభగలు ఇంకా తగ్గడం లేదు. పలు జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏదైనా పని నిమిత్తం బయటకు వెళ్లలేక ఇంటికే పరిమితమవుతున్నారు. అత్యవసరం అయితే తప్ప.. ప్రయాణాలకూ దూరంగానే ఉంటున్నారు. తాజాగా సూర్యాపేట, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లోని పలు మండలాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఇలా..: కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట, ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలాల్లో అత్యధికంగా 45.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నల్గొండ జిల్లాలోని దామరచర్లలో 45.2, ఖమ్మం జిల్లా నాగులవంచ, ఆదిలాబాద్ జిల్లాలోని జైనథ్లో 45.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో నలభై డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణశాఖ వెల్లడించింది.

ఇవీ చదవండి: