దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగ సంఘాలు చేపట్టిన సమ్మె కారణంగా... రాష్ట్రంలోనూ రెండు రోజుల పాటు బ్యాంకు కార్యకలాపాలకు ఆటంకం కలగనుంది. బ్యాంకు ఉద్యోగుల సమస్యలపై... ఇవాళ, రేపు జరిగే సమ్మెలో పాల్గొంటున్నట్లు.. తెలంగాణ, ఏపీ బ్యాంకు యూనియన్ల ఐక్య వేదిక తెలిపింది.
దేశ వ్యాప్తంగా 10వేల శాఖల్లో పనిచేస్తున్న పబ్లిక్, ప్రైవేటు సెక్టార్ బ్యాంకులతో పాటు ఫారిన్ బ్యాంక్ ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటున్నారు. వేతన సవరణ, 5 రోజుల పనివేళలు, ప్రత్యేక అలవెన్సులను బేసిక్‌పేలో కలపడం సహా... 12 డిమాండ్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారు. ప్రభుత్వంతో పలుమార్లు చర్చలు జరిపినా ప్రయోజనం లేకపోవడం వల్లే.. సమ్మెకు వెళ్తున్నట్లు ఐక్యవేదిక తెలిపింది. ఇప్పటికీ స్పందించకపోతే భవిష్యత్‌లో నిరవధిక సమ్మె చేస్తామని ఐక్యవేదిక స్పష్టం చేసింది.
ఇవీ చూడండి: హత్య కేసు నిందితుడి చెరలో 20మంది చిన్నారులు!